ETV Bharat / bharat

మెరుపు వేగంతో సరిహద్దుకు బలగాలు- భారత్​ వ్యూహం! - చైనా భారత్​ వార్తలు తాజా

సరిహద్దులో చైనాను ఎదుర్కొనేందుకు (India China Border) భారత్​ దీటుగా చర్యలు చేపడుతోంది. మౌలిక వసతులను భారీగా మెరుగుపరచుకోవడం సహా అధునాతన నిఘా సాధనాలను ఉపయోగిస్తోంది. భారీ ఆయుధ సంపత్తిని వేగంగా తరలించేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతోంది.

india - china border
మెరుపు వేగంతో బలగాలను తరలించేలా..
author img

By

Published : Oct 19, 2021, 7:20 AM IST

సరిహద్దుల్లో చైనా ఘర్షణకు దిగితే సమర్థంగా తిప్పికొట్టేందుకు (India China Border) భారత్‌ జోరుగా కసరత్తు చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సెక్టార్‌లో 1350 కిలోమీటర్ల పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ (India China Border) వెంబడి బలగాలు, భారీ ఆయుధ సంపత్తిని వేగంగా తరలించేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా మౌలిక వసతులను భారీగా మెరుగుపరచుకోవడం సహా అధునాతన నిఘా సాధనాలను ఉపయోగిస్తోంది. సైనిక పోరాట సన్నద్ధతకు ఊతమిచ్చేందుకు ఒక మెగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో దాదాపు 20 వంతెనలు, అనేక సొరంగ మార్గాలు, వైమానిక స్థావరాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

"ప్రత్యర్థి ఇప్పుడు మాపై మెరుపు దాడి చేయలేడు. ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోవడానికి మేం సిద్ధమవుతున్నాం" అని భారత సైన్యంలోని 5వ మౌంటెయిన్‌ డివిజన్‌ అధిపతి మేజర్‌ జనరల్‌ జుబిన్‌ ఎ మిన్‌వాలా పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని బుమ్‌ లా నుంచి భూటాన్‌కు (India China Border) పశ్చిమాన ఉన్న ప్రాంతం వరకూ విస్తరించిన కీలక భూభాగాన్ని రక్షించే బాధ్యత ఈ దళంపై ఉంది. ఇక్కడ తాము బలగాల సంఖ్యను పెంచడం లేదని జుబన్‌ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా ఇక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు పూర్తి అవగాహన పెంచుకుంటున్నామని తెలిపారు.

ఇదీ చూడండి : కశ్మీర్​లో వరుస హత్యలు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.