పది కోట్ల కరోనా డోసుల్ని 85రోజుల్లో పంపిణీ చేసిన వేగవంతమైన దేశంగా భారత్ నిలించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా 89 రోజుల్లో పది కోట్ల డోసుల్ని పంపిణీ చేసిందని, చైనా ఈ పది కోట్ల డోసుల మార్క్‌ను 102రోజుల్లో అందుకుందని వెల్లడించింది. 85రోజుల్లో అమెరికా 9.02కోట్ల డోసుల్ని మాత్రమే పంపిణీ చేసిందని పేర్కొంది. చైనా 85 రోజుల్లో6.14కోట్ల డోసుల్ని, బ్రిటన్ 85రోజుల్లో 2కోట్ల డోసుల్ని పంపిణీ చేసినట్లు వెల్లడించింది. కాగా భారత్‌లో పది కోట్లకు పైగా కరోనా డోసుల పంపిణీ పూర్తైనట్లు కేంద్రం తెలిపింది.
కాగా రోజుకు సగటు కరోనా డోసుల్ని పంపించడంలో కూడా భారత్ ప్రపంచంలోనే ముందజలో ఉన్నట్లు తెలిపింది. భారత్ రోజుకు సగటున 38,93,288 డోసుల్ని ఇస్తున్నట్లు వెల్లడించింది.
కాగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళలో మొత్తం కరోనా డోసుల్లో 60.62శాతం పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 2021జనవరి 16v మొదలైంది. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు ఇచ్చారు. ఫిబ్రవరి2 నుంచి కరోనా యోధులకు టీకా పంపిణీ చేశారు. మార్చి1నుంచి 60 ఏళ్లు పైబడినవారికి, 45సంవత్సరాలు వయస్సు పైబడి ఇతరేతర జబ్బులు ఉన్నవారికి కరోనా టీకాను ఇస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఆ తర్వాతే మహారాష్ట్రలో లాక్‌డౌన్‌పై నిర్ణయం'