Indian evacuation from Ukraine: యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినా అక్కడి భారతీయులను సురక్షితంగా స్వదేశం తీసుకురాగలిగామని విదేశాంగ మంత్రి జయ్‌శంకర్ తెలిపారు. తరలింపు ప్రక్రియపై రాజ్యసభలో ప్రకటన చేసిన ఆయన అనేక సవాళ్ల మధ్య దాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని గుర్తించి జనవరిలోనే తరలింపునకు రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించినట్లు వివరించారు. ఈ ప్రక్రియకు పౌర విమానయాన శాఖ సహా అన్ని విభాగాలు చక్కగా సహకరించాయని తెలిపారు. భారతీయుల తరలింపు ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరిపారని వివరించారు.
"ఉక్రెయిన్‌లో తీవ్రమైన సంక్షోభం వల్ల సవాళ్లు వచ్చినా 22,500 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగలిగాము. ప్రధాని మోదీ సూచనల మేరకు ఆపరేషన్ గంగ ప్రారంభించాం. మొత్తం తరలింపు ప్రక్రియ ప్రభుత్వ దృక్పథానికి అద్దం పడుతుంది. ప్రధాని దాదాపు ప్రతి రోజు స్వయంగా ఈ అంశంపై సమీక్ష చేశారు. విదేశాంగ శాఖ కూడా 24గంటలు పర్యవేక్షించింది."
-జై శంకర్, విదేశాంగ మంత్రి
భారతీయులను మాత్రమే కాకుండా... భారత్ నమ్మే వసుదైక కుటుంబంలో భాగంగా సుమారు 18 దేశాలకు చెందిన 147 మందిని తీసుకుని భారత్‌కు తీసుకుని వచ్చినట్లు జైశంకర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:
12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా.. ఈ 10 విషయాలు తెలుసుకోవాల్సిందే...