ETV Bharat / bharat

'వీసా వ్యవస్థపై అమెరికాతో సంప్రదింపులు' - భారత విదేశాంగ శాఖ

హెచ్​-1బీ వీసా ఎంపిక విధానాల్లో కీలక మార్పులు చేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత్​ స్పందించింది. వీసా వ్యవస్థతో పాటు ఇతర విషయాల్లో భారతీయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతున్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

India engaged with US for increased predictability in visa regime: MEA
'వీసా వ్యవస్థపై అమెరికాతో సంప్రదింపులు'
author img

By

Published : Jan 9, 2021, 8:37 AM IST

అమెరికా వీసా వ్యవస్థ భారతీయుల ఆశలకు అనుగుణంగా ఉండే విధంగా చూసేందుకు అగ్రరాజ్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ వెల్లడించారు. అంతేకాకుండా.. అగ్రరాజ్యంలో ఉన్న భారతీయులు, ఇక్కడ నుంచి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకుంటున్న వారు అసౌకర్యానికి గురవకుండాతగిన చర్యలు చేపట్టేందుకు కూడా చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. హెచ్​1బీ విసా ఎంపిక విధానాన్ని మార్చనున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో శ్రీవాస్తవ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"తమ దేశంలో ప్రవేశించే వలసదారులపై మరో మూడు నెలల పాటు నిషేధం విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని మేము పరిశీలిస్తున్నాం. వీసా వ్యవస్థతో పాటు అమెరికాలోని భారతీయులు, అక్కడి వెళ్లాలనుకుంటున్న వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకునేందుకు అగ్రరాజ్యంతో సంప్రదింపులు జరుపుతున్నాం."

--- అనురాగ్​ శ్రీవాస్తవ, భారత విదేశాంగశాఖ ప్రతినిధి.

ప్రస్తుతం ఉన్న లాటరీ పద్ధతి కాకుండా ఎంపికలో వ్యక్తి నైపుణ్యానికి, వేతనాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అమెరికా తెలిపింది. తుదపరి హెచ్​-1బీ వీసా జారీ ప్రక్రియ ఈ ఏడాది ఏఫ్రిల్​ 1 నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- 'టీకా పంపిణీతో మానవాళికి ప్రయోజనం కలగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.