ETV Bharat / bharat

దేశంలో స్థిరంగా కరోనా.. మరో 15 వేల మందికి వైరస్ - ఇండియా కొవిడ్ కేసులు

INDIA COVID CASES: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. తాజాగా 15,815 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 24 గంటల వ్యవధిలో 20,018 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

INDIA COVID CASES
INDIA COVID CASES
author img

By

Published : Aug 13, 2022, 9:30 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా ఉంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం 8 గంటల వరకు 15,815 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.36 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 20,018 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.27 శాతానికి పడిపోయాయి.

  • మొత్తం కేసులు: 4,42,39,372
  • క్రియాశీల కేసులు: 1,19,264
  • మొత్తం మరణాలు: 5,26,996
  • కోలుకున్నవారు: 4,35,73,094

Vaccination India:
భారత్​లో శుక్రవారం 24,43,064 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 207,71,62,098కు చేరింది. మరో 3,62,802 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లోనూ కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 7,80,825 మంది వైరస్​ బారినపడగా.. మరో 2,093 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,39,36,453కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,51,705 మంది మరణించారు. ఒక్కరోజే 7,60,524 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,60,04,736కు చేరింది.

  • జపాన్​లో కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. కొత్తగా 2,24,929 కేసులు నమోదయ్యాయి. 214 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో 1,28,671 కేసులు వెలుగులోకి వచ్చాయి. 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 85,116 కేసులు బయటపడ్డాయి. 335 మంది మరణించారు.
  • జర్మనీలో 45,859 కొవిడ్ కేసులు నమోదుకాగా... 137 మంది చనిపోయారు.
  • రష్యాలో తాజాగా 27,810 మంది కరోనా బాడినపడ్డట్లు తేలింది. 57 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో 26,689 మంది వైరస్​ బారిన పడ్డారు. 152 మంది మృతి చెందారు.

కొవిడ్‌ అన్ని వేరియంట్లను తట్టుకొనే యాంటీబాడీలు
కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 అన్నిరకాల వేరియంట్లపై సమర్థంగా పోరాడగలిగే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా భవిష్యత్తుల్లో కొవిడ్‌-19 అన్నిరకాల వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే టీకాను తయారుచేసేందుకు మార్గం సుగమం కానుంది. అమెరికాలోని శాన్‌డిగోలోని స్క్రిప్స్‌ పరిశోధక సంస్థ శాస్త్రవేత్తలు కోతుల్లో ఈ కొత్త యాంటీబాడీలను గుర్తించారు. ఇవి 2003లో వ్యాప్తిచెందిన అత్యంత ప్రాణాంతకమైన సార్స్‌-కోవ్‌-1 వంటి ఇతర సార్స్‌ వైరస్‌లపైనా సమర్థంగా పోరాడుతున్నట్లు వెల్లడైంది.

కొన్ని రకాల జంతువులు మనుషుల కంటే మెరుగ్గా అన్ని రకాల సార్స్‌ వైరస్‌ యాంటీబాడీలను తయారు చేసుకోగలవని అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు రీసస్‌ మకాక్‌ కోతులకు రెండు డోసుల సార్స్‌-కోవ్‌-2 స్పైక్‌ ప్రొటీన్‌ రోగనిరోధక శక్తిని అందించారు. అనంతరం పరిశీలించగా.. కోతులు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సహా వైరస్‌కు సంబంధించి యాంటీబాడీ స్పందనలను కలిగి ఉండడాన్ని గుర్తించారు. కొత్తగా పుట్టుకొచ్చే సార్స్‌-కోవ్‌-2 వేరియంట్లతోపాటు, ఇతర సార్స్‌ సంబంధిత వైరస్‌ల నుంచీ రక్షణ కల్పించే అధునాతన టీకాలను తయారుచేసేందుకు ఈ అధ్యయనం ఫలితాలు సహకరిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.