Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 18,257 మంది వైరస్ బారినపడగా.. మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 14,553 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.30 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు: 4,36,22,651
- మొత్తం మరణాలు: 5,25,428
- యాక్టివ్ కేసులు: 1,28,690
- కోలుకున్నవారి సంఖ్య: 4,29,68,533
Vaccination India: భారత్‌లో శనివారం 10,21,164 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,76,59,299కు చేరింది. మరో 4,32,777 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,81,875 మంది వైరస్ బారినపడ్డారు. మరో 844 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,01,94,924కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,72,318 మంది మరణించారు. ఒక్కరోజే 3,96,219 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,30,97,564కు చేరింది.
- ఇటలీలో కొత్తగా 98,044 మందికి వైరస్ సోకగా.. 105 మంది మరణించారు.
- జపాన్‌లో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 49,557 మందికి వైరస్ సోకింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 40,905 కేసులు నమోదు కాగా.. 154 మంది మరణించారు.
- ఆస్ట్రేలియాలో ఒక్కరోజే 37,344 మంది కొవిడ్ బారినపడగా.. 77 మంది ప్రాణాలు కోల్పోయారు..
ఇవీ చదవండి: యువతిపై ఐఎఫ్ఎస్ అధికారి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి!