Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 18,840 మంది వైరస్ బారినపడగా.. మరో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 16,104 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.51 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.29 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 4.14 శాతానికి తగ్గింది.
- మొత్తం మరణాలు: 5,25,386
- యాక్టివ్ కేసులు: 1,25,028
- కోలుకున్నవారి సంఖ్య: 4,29,53,980
Vaccination India: భారత్‌లో శుక్రవారం 12,26,795 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,65,36,288కు చేరింది. మరో 4,54,778 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 7,91,063 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,463 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 55,95,71,183కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,71,277 మంది మరణించారు. ఒక్కరోజే 4,87,206 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,26,40,181కు చేరింది.
- ఫ్రాన్స్‌లో 1,40,997 మంది వైరస్ బారిన పడ్డారు. 74 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో ఒక్కరోజే 1,07,777 మంది కొవిడ్ బారినపడగా.. 303 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో కొత్తగా 1,00,690 మందికి వైరస్ సోకగా.. 105 మంది మరణించారు.
- బ్రెజిల్లో 72,551 కేసులు నమోదు కాగా.. 274 మంది మరణించారు.
ఇవీ చదవండి: యువతిపై ఐఎఫ్ఎస్ అధికారి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి!