Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం మధ్య 12,751 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 42 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 3.50 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 16,412 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.51 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.30 శాతంగా ఉన్నాయి.
- మొత్తం కేసులు: 4,41,74,650
- మొత్తం మరణాలు: 5,26,772
- యాక్టివ్ కేసులు: 1,31,807
- కోలుకున్నవారి సంఖ్య: 4,35,16,071
Vaccination India:
భారత్‌లో సోమవారం 31,95,034 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 206.88 కోట్లు దాటింది. మరో 3,63,855 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 4,92,270 మంది వైరస్ బారినపడగా.. మరో 1234 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,99,25,217కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,38,226 మంది మరణించారు. ఒక్కరోజే 10,39,641 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,16,25,962కు చేరింది.
- జపాన్‌లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా 1,98,563 కేసులు నమోదయ్యాయి. 154 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో 55,292 కేసులు వెలుగులోకి వచ్చాయి. 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 44,123 కేసులు నమోదయ్యాయి. 134 మంది మరణించారు.
- ఆస్ట్రేలియాలో 22,201 కేసులు వెలుగులోకి వచ్చాయి. 14 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- రష్యాలో 17వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదు కాగా.. 45 మంది మృతి చెందారు.
లాంగ్ కొవిడ్ ముప్పు!
కొవిడ్-19 నుంచి బయటపడిన తరవాత కూడా నాలుగు నెలల వరకు తీవ్రమైన అలసట, తలనొప్పి పీడిస్తూనే ఉంటాయని అమెరికాలోని అగస్టా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం నిగ్గుతేల్చింది. కండరాల నొప్పులు, దగ్గు, వాసనలో, రుచిలో మార్పులు, జ్వరం, చలి, ముక్కు దిబ్బడ కూడా దీర్ఘకాలం వదలవని తెలిపింది.
కొవిడ్ వ్యాధి నాడీ కణజాలంలోనూ, మానసికంగానూ తీవ్ర మార్పులు కలిగిస్తుందని నిర్ధరణ అయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తమ పరిశోధనకు 200 మందిని ఎంచుకున్నారు. కొవిడ్ పాజిటివ్‌గా తేలినప్పటి నుంచి 125 రోజుల పాటు వారిని పరిశీలనలో ఉంచారు. వారిలో 68.5 శాతం మందిని తీవ్ర అలసట పీడించింది. 66.5 శాతంమంది తలనొప్పితో బాధపడ్డారు. 54 శాతంమంది వాసన, రుచిలో తేడాలు వచ్చాయన్నారు.