Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 18,815 మంది వైరస్ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గాయి. కొవిడ్ నుంచి 15,899 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.52 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.27 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది.
- మొత్తం మరణాలు: 5,25,343
- యాక్టివ్ కేసులు: 1,22,335
- కోలుకున్నవారి సంఖ్య: 4,29,37,876
Vaccination India: భారత్‌లో గురువారం 17,62,441 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,51,77,962కు చేరింది. మరో 3,79,470 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,25,494 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,725 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 55,85,51,294కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,68,901 మంది మరణించారు. ఒక్కరోజే 6,16,015 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,20,62,157కు చేరింది.
- ఫ్రాన్స్‌లో 1,61,265 మంది వైరస్ బారిన పడ్డారు. 89 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 1,17,732 కేసులు బయటపడగా.. 131 మంది తుది శ్వాస విడిచారు.
- ఇటలీలో కొత్తగా 1,07,240 మందికి వైరస్ సోకగా.. 94 మంది మరణించారు.
- అమెరికాలో ఒక్కరోజే 91,472 మంది కొవిడ్ బారినపడగా.. 320 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 73,365 కేసులు నమోదు కాగా.. 297 మంది మరణించారు.
ఇవీ చదవండి: యువతిపై ఐఎఫ్ఎస్ అధికారి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి!