INDIA COVID CASES: దేశంలో కరోనా కేసులు తగ్గుతూ ఉండటం ఊరటనిస్తోంది. కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయి. వెయ్యి కన్నా తక్కువగా రోజువారీ కేసుల సంఖ్య నమోదు కావడం గత 715 రోజుల్లో ఇదే తొలిసారి. 1,316 మంది కోలుకోగా 13 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గి 0.03 శాతానికి చేరుకుంది. రోజువారీ పాజిటివీ రేటు 0.29 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 1,84,70,83,279 డోసులు పంపిణీ చేశారు. ఆదివారం 2,84,073 మందికి టీకాలు అందించారు. 3,18,823 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
- మొత్తం కేసులు- 4,30,29,044
- మరణాలు- 5,21,358
- యాక్టివ్ కేసులు- 12,597
- రికవరీలు- 42,495,089
World Corona cases: ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా 779,220 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 491,564,725 పెరిగింది. మహమ్మారి ధాటికి 1893 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,175,811కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 58,923,361గా ఉంది. దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో 234,301 కరోనా కేసులు నమోదయ్యాయి. 17,235 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో తాజాగా 57,761 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 34 మంది మృతి చెందారు.
- ఫ్రాన్స్‌లో 102,266 కరోనా కేసులు బయటపడ్డాయి. 31 మంది మృతి చెందారు.
- వియత్నాంలో 50,730 మంది వైరస్ సోకింది. మరో 37 ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 6,241 మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 39 మంది వైరస్‌కు బలయ్యారు.
- రష్యాలో 16,828 కేసులు వెలుగు చూశాయి. మహమ్మారి ధాటికి 304 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో మరో 4,178 మందికి వైరస్ సోకగా.. 77 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి: చైనాలో ఒక్కరోజే 13 వేల కేసులు.. మాస్కుతోనే కొత్త వేరియంట్ కట్టడి!