India Covid cases: దేశంలో కొత్తగా 7,992 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 393 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 9,265 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 559 రోజుల కనిష్ఠానికి చేరింది.
మొత్తం కేసులు: 3,46,82,736
మొత్తం మరణాలు: 4,75, 128
యాక్టివ్ కేసులు: 93,277
కోలుకున్నవారు: 3,41,14,331
Vaccination in India
దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. శుక్రవారం 76,36,569 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,31,99,92,482కి చేరింది.
World Covid cases
అటు, ప్రపంచవ్యాప్తంగా 6,08,765 కేసులు వెలుగుచూశాయి. మొత్తం 7,608 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 458,136 మంది కోలుకున్నారు. అన్ని దేశాల్లో కలిపి రెండు కోట్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే లక్షా 36 వేల కేసులు బయటపడ్డాయి. 1574 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల ఏడు లక్షలు దాటింది.
- జర్మనీలో వైరస్ విజృంభిస్తోంది. తాజాగా 58,969 మందికి పాజిటివ్‌గా తేలింది. 496 మరణాలు సంభవించాయి. 10 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- బ్రిటన్‌లో కొత్తగా 58,194 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 120 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి ఏడు లక్షలు దాటింది.
- రష్యాలో వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఒక్కరోజే 1176 మంది మరణించారు. కొత్తగా 30,873 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: Mother Kills Newborn: నీళ్లల్లో ముంచి.. కన్నబిడ్డనే చంపేసిన తల్లి