India Covid Cases: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 4,575 కేసులు బయటపడగా.. మరో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,416 మంది వైరస్‌ను జయించారు. దీంతో రికవరీ రేటు మెరుగుపడి 98.69 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.11 శాతానికి తగ్గింది. రోజువారీ పాజిటివిటి రేటు 0.51 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.62 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.20 శాతానికి చేరింది.
- మొత్తం కేసులు: 4,29,75,883
- మొత్తం మరణాలు: 5,15,355
- యాక్టివ్ కేసులు: 46,962
- కోలుకున్నవారు: 4,24,13,566
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం మరో 18,69,103డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,79,33,99,555కు చేరింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. తాజాగా 16,02,748 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 45 కోట్లకు చేరువైంది. కొత్తగా మరో 6,812 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 60,35,954కు చేరుకుంది.
- జర్మనీలో ఒక్కరోజే 1,93,013 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. వైరస్ ధాటికి 583 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో తాజాగా 29,632 మందికి వైరస్ సోకింది. మరో 1,128 మంది మృతి చెందారు.
- రష్యాలో కొత్తగా 66,576 కరోనా కేసులు నమోదయ్యాయి. 652 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 75,495 మందికి వైరస్ సోకగా.. 518 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చూడండి: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా!- మొరాదాబాద్ నుంచి ఎంపీగా పోటీ?