INDIA COVID CASES: దేశంలో కరోనా కేసులు తగ్గుతూ ఉండటం ఊరటనిస్తోంది. కొత్తగా 1,096 కరోనా కేసులు నమోదయ్యాయి. 1447 మంది కోలుకోగా 81 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గి 0.03 శాతానికి చేరుకుంది. రోజువారీ పాజిటివీ రెేటు 0.24 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 1,84,66,86,260 డోసులు పంపిణీ చేశారు. శనివారం 12,75,495 మందికి టీకాలు అందించారు. 4,65,904 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
- మొత్తం కేసులు- 4,30,28,131
- మరణాలు- 5,21,345
- యాక్టివ్ కేసులు- 13,013
- రికవరీలు- 42,493,773
World Corona cases: ప్రపంచవ్యాప్తంగా కూడా రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా 1,023,332 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 490,731,323 పెరిగింది. మహమ్మారి ధాటికి 2,735 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,173,916కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 58,986,922గా ఉంది. దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో 264,097 కరోనా కేసులు నమోదయ్యాయి. 16,929 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో తాజాగా 128,639 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 187 మంది మృతి చెందారు.
- ఫ్రాన్స్‌లో 132,114 కరోనా కేసులు బయటపడ్డాయి. 68 మంది మృతి చెందారు.
- వియత్నాంలో 65,619 మంది వైరస్ సోకింది. మరో 37 ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 12,661 మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 150 మంది వైరస్‌కు బలయ్యారు.
- రష్యాలో 17,949 కేసులు వెలుగు చూశాయి. మహమ్మారి ధాటికి 340 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో మరో 20,473 మందికి వైరస్ సోకగా.. 127 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి: మానవత్వం నిలిపిన ప్రాణం.. పసిగుండెను కాపాడేందుకు తరలిన జనం!