భారత్‌లో కరోనా(Coronavirus update) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 8,488 మంది (Covid cases in India) వైరస్ బారిన పడ్డారు. మరో 249 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 12,510 మంది కరోనాను జయించారు.
కొత్త కేసులు భారత్‌లో 538 రోజుల కనిష్ఠానికి కొవిడ్ చేరుకోగా.. యాక్టివ్ కేసులు 534 రోజుల కనిష్ఠానికి దిగొచ్చాయి.
- మొత్తం కేసులు: 3,45,18,901
- మొత్తం మరణాలు: 4,65,911
- యాక్టివ్ కేసులు: 1,18,443
- మొత్తం కోలుకున్నవారు: 33,934,547
నిర్ధరణ పరీక్షలు..
భారత్‌లో నవంబరు 21న 7,83,567 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా పరీక్షల సంఖ్య(India Covid test report) 63,25,24,259కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో (coronavirus worldwide) తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,86,897 మందికి కొవిడ్ (Corona update) పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి 4,114 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,5,78,09,749కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 51,67,588కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 27,484 మందికి వైరస్ సోకగా.. మరో 96 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్ట్రియాలో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.
- రష్యాలో కొత్తగా 36,970 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 1,252 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 40,004 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 61 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 21,177 మంది వైరస్ బారిన పడగా.. 195 మంది మరణించారు.
- జర్మనీలో కొత్తగా మరో 36,860 మందికి కొవిడ్ సోకింది. 60 మంది చనిపోయారు.
లాక్డౌన్ షురూ..
కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను విధించింది ఆస్ట్రియా(austria lockdown) ప్రభుత్వం. నిత్యావసరాల కొనుగోలు, ఆసుపత్రులకు వెళ్లడం వంటి సేవల కోసం కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక రెస్టారెంట్లు, ఇతర దుకాణాలన్నింటినీ తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు, పాఠశాలలు, డే కేర్ సెంటర్‌లు తెరిచి ఉంటాయని.. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంట్లో ఉంచేందుకే మొగ్గుచూపాలని ప్రభుత్వం కోరింది.
లాక్‌డౌన్‌పై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనితో నిబంధనలపై 10 రోజుల అనంతరం సమీక్షించనున్నారు. గరిష్ఠంగా 20 రోజుల పాటు ఆంక్షలు కొనసాగననున్నట్లు తెలుస్తోంది. 'డిసెంబరు 13న కొవిడ్ నిబంధనలు ఎత్తేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. టీకాలు తీసుకోని వారిపై కఠిన ఆంక్షలను విధించే అవకాశం ఉంది' అని ఓ అధికారి తెలిపారు.
మరోవైపు.. ఐరోపా వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నందున ఆయా ప్రభుత్వాలు లాక్డౌన్ విధించే యోచనలో ఉన్నాయి.
ఇవీ చదవండి: