దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య (Coronavirus update) బుధవారంతో పోలిస్తే కాస్త పెరిగింది. తాజాగా 11,919 మందికి కొవిడ్ పాజిటివ్‌గా(Corona cases in India) తేలింది. మహమ్మారి ధాటికి మరో 470 మంది మృతి చెందారు. తాజాగా 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,44,78,517
- మొత్తం మరణాలు: 4,64,623
- యాక్టివ్ కేసులు: 1,28,762
- కోలుకున్నవారు: 3,38,85,132
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,95,653 మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 8,399 మంది మృతి చెందారు.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 1,04,702 మందికి వైరస్ సోకింది. మరో 1,416 మంది చనిపోయారు.
- జర్మనీలో కొత్తగా మరో 60,753 మందికి కొవిడ్ సోకింది. 248 మంది మరణించారు.
- బ్రిటన్‌లో కొత్తగా 38,263 మందికి వైరస్ బారినపడ్డారు. మరో 201 మంది మృతి చెందారు.
- రష్యాలో మరో 36,626 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు.
- టర్కీలో కొత్తగా 23,867 కరోనా కేసులు నమోదవగా.. 229 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొనసాగుతున్న కరోనా కల్లోలం..
- కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ కొరియాలో బూస్టర్ డోసు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం టీకా రెండు డోసులు తీసుకున్నవారికి 'బూస్టర్ షాట్' అందించాలని అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దక్షిణ కొరియాలో బుధవారం కొత్తగా 3,187 కేసులు వెలుగుచూశాయి. వీటిలో సియోల్, పరిసర ప్రాంతాల 2,550 కేసులు నుంచే నమోదయ్యాయి. దేశంలో డెల్టా వేరియంట్ ప్రబలతున్న సమయంలో.. ఆంక్షలను సడలింపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- హంగేరీలో కరోనా ఉప్పెనలా విరుచుకుపడుతోంది. అక్కడ మహమ్మారి కేసులు, మరణాలు గరిష్ఠంగా నమోదువుతున్నాయి. కోటి మంది జనాభా ఉన్న ఈ దేశంలో 10,265 కొత్త కేసులు వెలుగుచూడగా.. 178 మరణాలు నమోదయ్యాయి. టీకాల పంపిణీలో ఈయూలోని ఇతర దేశాలతో పోలిస్తే హంగేరీ దాదాపు 9 శాతం వెనుకబడి ఉంది. అక్కడ ఇప్పటివరకూ మొత్తం జనాభాలో దాదాపు 60 శాతం మందికి మాత్రమే టీకాలు అందాయి.
- జర్మనీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలను విధించే యోచనలో ఉంది ప్రభుత్వం. అక్కడ బుధవారం ఒక్కరోజే 52,826 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 294 మంది మరణించారు. దీనితో మహమ్మారి మరణాల సంఖ్య 98,274కి చేరుకుంది.
- ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాలు పెరుగుతున్న ఏకైక ప్రాంతంగా ఐరోపాను ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. గతవారం నమోదైన 33లక్షల కొత్త కేసుల్లో 21లక్షలు ఐరోపా నుంచే వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపా మినహా అన్ని ప్రాంతాల్లో కరోనా మరణాలు స్థిరంగా తగ్గుతున్నాయని పేర్కొంది.
ఇవీ చదవండి: