ETV Bharat / bharat

India Corona cases: 575 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్​ కేసులు - Covid World cases

India Covid cases: భారత్​లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 6,317‬ మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 318 మంది మృతి చెందారు. కాగా దేశంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 215కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Corona cases
India Corona cases
author img

By

Published : Dec 22, 2021, 9:43 AM IST

India Corona cases: దేశంలో కొత్తగా 6,317 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 6,906 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 575 రోజుల కనిష్ఠానికి చేరింది.

  • మొత్తం కేసులు: 3,47,58,481
  • మొత్తం మరణాలు: 4,78,325
  • యాక్టివ్ కేసులు: 78,190
  • కోలుకున్నవారు: 3,42,01,966

Omicron Cases in India:

యావత్‌ ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా.. మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 215 దాటింది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్​ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొంది. పూర్తికథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Vaccination in India:

దేశంలో టీకా పంపిణీ శరవేగంగానే కొనసాగుతోంది. మంగళవారం 57,05,039 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,95,90,670కి చేరింది.

Covid World cases:

ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ వాటానే అధికంగా ఉంటోంది. మరోవైపు డెల్టా వేరియంట్​ సైతం వేగంగా విస్తరించడం వల్ల కొవిడ్​ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా తాజాగా 7,45,639 మంది కరోనా​ బారినపడ్డారు. మరో 7,114 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. కొత్తగా 1,81,264 కరోనా కేసులు వెలుగుచూశాయి. 1,811 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 8,30,990కి చేరుకుంది.
  • బ్రిటన్​లో నమోదైన కరోనా కేసులు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 90,629 మందికి కొవిడ్​ సోకింది. 172 మంది మరణించారు. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ వాటా క్రమంగా పెరుగుతోందని ఆ దేశ వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • ఫ్రాన్స్​లో కొవిడ్​ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దేశంలో మరో 72,832 కేసులు నమోదయ్యాయి. 229 మంది మృతి చెందారు.
  • రష్యాలో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరో 1,027 మంది వైరస్​ ధాటికి బలయ్యారు. కొత్తగా 25,90 కేసులు బయటపడ్డాయి. మొత్తం మరణాల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది.

ఇదీ చదవండి: మూడు రెట్లు వేగంగా ఒమిక్రాన్​ వ్యాప్తి.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.