India Corona cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మరో 4,041 మంది వైరస్ బారినపడ్డారు. దాదాపు 84 రోజుల తర్వాత.. కేసులు 4 వేల మార్కును దాటాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.73గా ఉంది. ఒక్కరోజే 10 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గురువారం 2363 మందికిపైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. గురువారం కూడా మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజే మరో 1045 మంది కొవిడ్ బారినపడ్డారు. ముంబయి, పుణె, ఠాణెలోని పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 4559కు పెరిగాయి. ఇందులో సగానికిపైగా ముంబయి నుంచే ఉన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.
- దేశంలో మొత్తం కరోనా కేసులు: 4,31,68,585
- మొత్తం మరణాలు: 5,24,651
- యాక్టివ్ కేసులు: 21,177
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,22,757
Vaccination India: దేశవ్యాప్తంగా గురువారం 12,05,840 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,83,72,365కు చేరింది. ఒక్కరోజే 4,25,379 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లోనూ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 5 లక్షల 44 వేలమందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 1400 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 533,992,600కు చేరింది. మరణాల సంఖ్య 6,317,321కు చేరింది. ఒక్కరోజే 545,590 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 504,853,561గా ఉంది.
- ఉత్తర కొరియాలో మళ్లీ రికార్డు స్థాయిలో లక్ష కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం కేసులు 40 లక్షలకు చేరువయ్యాయి.
- అమెరికాలో గురువారం 80 వేలకుపైగా కేసులు, 200కిపైగా మరణాలు నమోదయ్యాయి.
- జర్మనీలో మరో 47 వేలమంది కొవిడ్ బారినపడ్డారు. ఒక్కరోజు 100 మందికిపైగా చనిపోయారు.
- బ్రెజిల్లో మరో 41 వేలకుపైగా, ఆస్ట్రేలియాలో 34 వేలమందికి వైరస్‌కు సోకింది.
ఇవీ చదవండి: 'దేశంలో జనాభా నియంత్రణకు త్వరలోనే కొత్త చట్టం'
మహాత్ముని గళాన్ని ప్రజలకు చేరవేసిన.. 'షికాగో' రేడియో స్పీకర్స్!