దేశంలో కరోనా మహమ్మారి మృత్యుఘోష కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం తగ్గటం లేదు. గురువారం మళ్లీ 4 వేలపైనే మృతి చెందారు.
దేశంలో కొత్తగా 2,59,591 కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో మరో 4,209 మంది చనిపోయారు. కొవిడ్ సోకిన వారిలో మరో 3,57,295 మంది కోలుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- మొత్తం కేసులు: 2,60,31,991
- మొత్తం మరణాలు: 2,91,331
- మొత్తం కోలుకున్నవారు: 2,27,12,735
- యాక్టివ్ కేసులు: 30,27,925
దేశవ్యాప్తంగా గురువారం 20,61,683 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది.
కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 19.18 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి: 'హైఫై మాస్క్ వ్యాక్సిన్లా పనిచేస్తుంది'