India Covid Cases: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య నాలుగువేల దిగువన నమోదైంది. కొత్తగా 3,614 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా ధాటికి మరో 89 మంది మృతి చెందారు. 5,185 మంది వైరస్‌ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు: 42,987,875
- మొత్తం మరణాలు: 5,15,803
- యాక్టివ్ కేసులు: 40,559
- కోలుకున్నవారు: 4,24,31,513
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. శుక్రవారం మరో 18,18,511 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,79,91,57,486కు పెరిగింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగానూ రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో తగ్గింది. తాజాగా 16,89,274 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 45,55,68,896కి పెరిగింది. మరో 5,946 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,058,011కు చేరింది.
- జర్మనీలో తాజాగా 2,45,342 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 242 మంది మృతి చెందారు.
- అమెరికాలో కొత్తగా 39,254 మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 1,022 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో ఒక్కరోజే 50,743 కరోనా కేసులు బయటపడ్డాయి. 674 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 55,211మందికి వైరస్ సోకగా.. 465 మంది వైరస్‌కు చనిపోయారు.
ఇదీ చూడండి: భారత్‌లో 40 లక్షల కొవిడ్ మరణాలు.. ఖండించిన కేంద్రం