India Corona cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా 2,745 కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా ఆరుగురు ప్రాణాలు విడిచారు. 2236 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,60,832
- మొత్తం మరణాలు: 5,24,636
- యాక్టివ్ కేసులు: 18,386
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,17,810
Vaccination India: దేశవ్యాప్తంగా మంగళవారం 10,91,110 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,57,20,807 కు చేరింది. ఒక్కరోజే 4,55,314 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కుడా భారీగా పెరిగాయి. కొత్తగా 533,069 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,411 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 532,657,109కు చేరింది. మరణాల సంఖ్య 6,313,584కు చేరింది. ఒక్కరోజే 651,167 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 503,634,059గా ఉంది.
- జర్మనీలో కొత్తగా 59,480 కేసులు నమోదయ్యాయి. 332 మంది మృతి చెందారు.
- బ్రెజిల్లో ఒక్కరోజే 41,377 కొత్త కేసులు వెలుగు చూశాయి. మహమ్మారితో 159 చనిపోయారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 33,302 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 54 మంది మృతిచెందారు.
- జపాన్‌లో కొత్త కేసులు 18,686 నమోదయ్యాయి. మరోవైపు.. ఫ్రాన్స్‌లో తాజాగా 35,142 కేసులు నమోదయ్యాయి.
- ఇటలీలో తాజాగా 24,267 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 66 మంది మృతి చెందారు.
ఇవీ చదవండి: 'దేశంలో జనాభా నియంత్రణకు త్వరలోనే కొత్త చట్టం'
మహాత్ముని గళాన్ని ప్రజలకు చేరవేసిన.. 'షికాగో' రేడియో స్పీకర్స్!