India Covid Cases: దేశంలో కొవిడ్ కేసులు ఆందోళనకరంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 13,272 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది కరోనాతో మరణించగా.. 13,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.58 శాతం వద్ద స్థిరంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.23 శాతం, డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగాయి.
- మొత్తం కేసులు: 4,43,27,890
- క్రియాశీల కేసులు: 1,01,166
- మొత్తం మరణాలు: 5,27,289
- కోలుకున్నవారు: 4,36,99,435
Vaccination India: భారత్‌లో శుక్రవారం 13,15,536 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,09,40,48,140కు చేరింది. ఒక్కరోజే 3,15,231 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఒక్కరోజే 7 లక్షల 40 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. దాదాపు 2000 మంది చనిపోయారు. మొత్తం కేసులు 60 కోట్లకు చేరువయ్యాయి. మరణాల సంఖ్య 65 లక్షలకు చేరువైంది. 9 కోట్ల మందికిపైగా కోలుకున్నారు.
- జపాన్‌లో కొవిడ్ బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 2 లక్షల 61 వేల మంది వైరస్ బారినపడ్డారు. మరో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు కోటీ 64 లక్షలు దాటాయి.
- దక్షిణ కొరియాలో కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా లక్షా 38 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.
- రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్‌లోనూ సగటున 20-30 వేల మధ్య కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి.
- అమెరికాలో మరో 75 వేల మందికి కొవిడ్ సోకింది. 326 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 10 కోట్లకు చేరువయ్యాయి.
ఇవీ చదవండి: మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా
కలెక్టర్ హత్య కేసులో ఆ నేతకు జీవితఖైదు, అయినా ఇంట్లోనే కాలక్షేపం