ETV Bharat / bharat

భారత్​-చైనా మధ్య 12వ విడత చర్చలు- సంధి కుదిరేనా? - బలగాల ఉపసంహరణ

తూర్పు లద్దాఖ్‌లో మళ్లీ సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తిన వేళ శనివారం భారత్‌, చైనా మధ్య కోర్‌ కమాండర్‌ స్ధాయి అధికారుల 12వ విడత సమావేశం జరగనుంది. చైనా భూభాగంలోని మోల్డో వద్ద జరగనున్న ఈ భేటీలో హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా హైట్స్‌ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల సైనిక అధికారులు చర్చించే అవకాశం ఉందని భారత సైనిక వర్గాలు తెలిపాయి.

india china talks
చైనా
author img

By

Published : Jul 30, 2021, 8:27 PM IST

దాదాపు మూడున్నర నెలల తర్వాత భారత్‌, చైనా మధ్య కోర్‌ కమాండర్‌ స్థాయి అధికారుల మరో విడత చర్చలకు రంగం సిద్ధమైంది. 2020 మే నెలలో సరిహద్దు వివాదం తలెత్తినప్పటి నుంచి ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు 11 సార్లు కోర్‌ కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఏప్రిల్​ 9న 11వ భేటీ జరగగా.. శనివారం తదుపరి విడత సమావేశం జరగనుంది. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 10.30కు ఈ భేటీ జరగనుంది. హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా హైట్స్‌ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది.

భారత్‌, చైనా మధ్య ఏడాది నుంచి సరిహద్దు వివాదం సాగుతున్నా విస్తృత స్ధాయి చర్చల తర్వాత పాంగాంగ్‌ సరస్సు ప్రాంతం నుంచి ఇరుదేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఘర్షణకు కేంద్ర బిందువుగా నిలిచిన అన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరగాలని భారత్‌ స్పష్టం చేస్తుండగా.. చైనా మాత్రం మొదట ఉద్రిక్తతలు చల్లారాలని వాదిస్తోంది. సరిహద్దులకు కాస్త దూరంలో మోహరించిన భారత అదనపు బలగాలు తమ పాత స్థానాలకు వెళ్లిపోవాలని, ఆ తర్వాతే ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల్లో మిగిలిన చోట్ల నుంచి బలగాల ఉపసంహరణ జరుగుతుందని చెబుతోంది.

డ్రాగన్ ద్వంద్వ వైఖరి..

ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఓ వైపు కోర్‌ కమాండర్‌ స్ధాయి చర్చలు జరుగుతుండగా ఇటీవల చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. తూర్పు లద్దాఖ్‌లో వైమానిక స్థావరాలను ఏర్పాటు చేసింది. దీనికి తోడు దెమ్‌చోక్‌ వద్ద భారత భూభాగంలో చైనా పౌరులు గుడారాలతో తిష్ఠ వేశారు. దెమ్‌చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద భారత భూభాగంలో ఆ గుడారాలు వెలిశాయి. అందులోని వ్యక్తులు చైనా పౌరులుగా చెప్పుకొంటున్నారని భారత అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని భారత సైన్యం ఆదేశించినప్పటికీ వారు అక్కడే కొనసాగుతున్నారని వెల్లడించారు.

తూర్పు లద్దాఖ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం వల్ల భారత్‌ ఉత్తర కమాండ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళాలను ఎల్‌ఏసీ వద్దకు తరలించింది. ఈ పరిస్ధితుల మధ్య శనివారం జరిగే కార్ప్స్‌ కమాండర్‌ స్ధాయి అధికారుల 12వ విడత చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇదీ చూడండి: సరిహద్దు నుంచి వెనక్కి వెళ్లే ఉద్దేశం చైనాకు లేదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.