ETV Bharat / bharat

ఈ నెల 20న భారత్‌-చైనా పదో విడత చర్చలు - వివాదాలు

వాస్తవాధీన రేఖ వద్ద చెలరేగిన వివాదాలను పరిష్కరించేందుకు భారత్​- చైనా పదో విడత చర్చలకు సిద్ధమయ్యాయి. చైనా భూభాగంలో మాల్దో పోస్టు దగ్గర ఈ సమావేశం శనివారం జరుగనుంది.

India-China tenth round of talks
భారత్‌-చైనా పదో విడత చర్చలు
author img

By

Published : Feb 19, 2021, 2:12 PM IST

భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద చెలరేగిన వివాదాలను పరిష్కరించుకొనేందుకు మరోసారి సమావేశం కానున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద ఈ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని ఆంగ్ల వార్త సంస్థ ఏఎన్‌ఐ సైనిక వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది. ఇప్పటికే పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ భూభాగాల్లో నుంచి బలగాల ఉపసంహరణ వేగంగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని సమీక్షించడంతో పాటు మిగిలిన ప్రదేశాల్లో వివాదాలపై కూడా చర్చించనున్నారు.

చైనా కీలక ప్రకటన

భారత్‌-చైనా సరిహద్దుల మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించే కీలకమైన ప్రకటన గత బుధవారం చైనా రక్షణశాఖ చేసింది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి భారత్‌-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. ఆ తర్వాత భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ దీనిని ధ్రువీకరించారు. మరోవైపు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఈ ఉపసంహరణ ప్రక్రియపై స్పందించారు. మాస్కోలో జరిగిన భారత్‌, చైనా విదేశాంగమంత్రుల సమావేశం, ఇటీవల జరిగిన తొమ్మిదో రౌండ్‌ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల ఫలితంగా ఏర్పడిన ఏకాభిప్రాయం ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టంభన తొలగడానికి గత నెల 24న జరిగిన తొమ్మిదో రౌండ్‌ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలే కారణమని చైనా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే చైనాకు చెందిన బలగాలు వెనక్కి మళ్లినట్లు ఫొటోలు వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది.

ఇదీ చూడండి:16 గంటల పాటు సాగిన భారత్​- చైనా చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.