సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి చైనా సైనికులు వెనుదిరిగిన వీడియో, ఛాయా చిత్రాలను భారత సైన్యాధికారులు విడుదల చేశారు. బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.
పాంగాంగ్ ఎత్తైన ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైనికులు దిగడం ప్రారంభించారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఫింగర్ 4 నుంచి 8 వరకు ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను కూడా చైనా తొలగించడం మొదలుపెట్టిందని తెలిపాయి. ఫింగర్ ప్రాంతంలో ఎత్తులో ఏర్పాటు చేసిన అన్ని చైనీస్ పోస్టులను కూడా ఖాళీ చేస్తున్నట్లు చెప్పాయి.
బలగాల ఉపసంహరణలో భాగంగా పాంగాంగ్ దక్షిణ భాగంలో మోహరించిన దాదాపు 200 చైనీస్ యుద్ధ ట్యాంకులను చైనా వెనక్కి తీసుకుంది. ఫిబ్రవరి 20 నాటికి చైనా సైన్యం పాంగాంగ్ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేయవచ్చని భారత సైన్యాధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: భారత్ 'మాస్టర్ స్ట్రోక్' వల్లే తోకముడిచిన డ్రాగన్!