భారత్లో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. కేరళలో కొత్తగా 13,550 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 11,529 మంది కోలుకోగా, 104 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో కొత్తగా 8,085 కేసులు బయటపడ్డాయి. 8,623 మంది డిశ్చార్జ్ కాగా, 231 మంది ప్రాణాలు కోల్పోయారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో కొత్తగా 4,512 కేసులు నమోదయ్యాయి. 6,013 మంది కోలుకోగా, 118 మంది మృతిచెందారు.
- కర్ణాటకలో కొత్తగా 3,222 కేసులు నమోదు కాగా.. 14,724 మంది డిశ్చార్జి అయ్యారు. 93 మంది మృతిచెందారు.
- దేశ రాజధాని దిల్లోలో 101 కేసులు బయటపడ్డాయి. నలుగురు మృతి చెందారు.
- గుజరాత్లో వరుసగా రెండో రోజు 100కు తక్కువ రోజువారీ కేసులు నమోదయ్యాయి. తాజాగా 93 కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చదవండి:11 నెలల తర్వాతే వ్యాక్సిన్ రెండో డోసు!