ETV Bharat / bharat

'కరోనాను ఓడించడానికి భారత్ సంసిద్ధం' - రక్తదాన శిబిరం

కరోనాను ఎదుర్కోవడంలో గతేడాది కంటే ఈసారి భారత్ మానసికంగా, భౌతికంగా పరిెణితి సాధించిందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ అన్నారు. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్​లోని వేర్వేరు చోట్ల రక్తదాన శిబిరాలను వర్చువల్​గా ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Harsh Vardhan
కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్
author img

By

Published : Apr 27, 2021, 6:58 PM IST

గతేడాది కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం వైరస్​ను ఎదుర్కోవడంలో భారత్ భౌతికంగా, మానసికంగా పరిణితి సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్​లోని 13చోట్ల రక్తదాన శిబిరాలను వర్చువల్​గా ప్రారభిస్తూ హర్షవర్ధన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్ కారణంగా రక్తం కొరత తీర్చడానికి కంపీటెంట్ ఫౌండేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థల సాయంతో రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేస్తోంది.

రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేసినందుకు కంపీటెంట్ ఫౌండేషన్​ను మంత్రి ప్రశంసించారు. సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అయితే కరోనా టీకా వేసుకోక ముందు రక్తదానం చేయాలని కోరారు. టీకా వేసుకున్న రెండు నెలల తర్వాతనే ఆ పని చేయాలని సూచించారు.

ఇదీ చదవండి: డాక్టర్ చెంప చెళ్లుమనిపించిన నర్సు- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.