కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు వేసుకున్న భారతీయులకు 'గ్రీన్‌పాస్' పథకం కింద ఐరోపా దేశాలు అనుమతించాలని ఐరోపా సమాఖ్యకు(ఈయూ) భారత్ విజ్ఞప్తి చేసింది. జూన్ 1 నుంచి గ్రీన్‌పాస్ పథకాన్ని ఈయూ అమల్లోకి తీసుకురానుంది. దీని ప్రకారం ఐరోపా మెడిసిన్ ఏజెన్సీ(ఈఎంఏ) ధ్రువీకరించిన టీకాలు వేసుకుంటే ఈయూ దేశాల్లో ఆంక్షలు లేకుండా ప్రయాణించవచ్చు.
దీంతో గ్రీన్పాస్లోకి కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ను చేర్చి.. కొవిన్ పోర్టల్ ద్వారా ఇచ్చే వ్యాక్సినేషన్ ధ్రువపత్రాలను అంగీకరించాలని భారత్ కోరింది. ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తే.. తాము కూడా ఈయూ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని పేర్కొంది.
ఇదీ చూడండి: అమెరికా అధ్యక్షుడి ఐస్‌క్రీం సరదాలు