ETV Bharat / bharat

'ఒంటెద్దు పోకడ వల్లే'- కాంగ్రెస్​పై ఇండియా పార్టీలు ఫైర్! ​కూటమిపై ఫలితాల ప్రభావం ఎంత? - కాంగ్రెస్ తీరు​పై ఇండియా పార్టీలు ఫైర్

India Alliance Parties on Congress Party : నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసిన కాంగ్రెస్​పై మండిపడుతున్నాయి ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు. కూటమి పార్టీల మద్దతు తీసుకోకుండా ఒంటెద్దు పోకడతో వెళ్లడం వల్లే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వచ్చిందని విమర్శిస్తున్నాయి.

india alliance future plans
india alliance future plans
author img

By PTI

Published : Dec 4, 2023, 7:20 AM IST

India Alliance Parties on Congress Party : సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్​గా భావించే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పేలవమైన ప్రదర్శన చేసింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకోలేకపోగా, ఇటు మధ్యప్రదేశ్‌లోనూ అవకాశాన్ని కోల్పోయింది. ఒక్క తెలంగాణలో మాత్రమే సానుకూల ఫలితాన్ని సాధించింది. దీంతో కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్‌ తీరును తప్పుపడుతున్నాయి. విపక్షాల మద్దతు తీసుకోకుండా ఒంటెద్దు పోకడతో వెళ్లడం వల్లే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మపరిశీలన చేసుకొని, కూటమిలోని పక్షాలతో కలిసి నడవాలని సూచిస్తున్నాయి.

కూటమిపై ప్రభావం చూపుతుందా?
అయితే, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెందడం ఇండియా కూటమిపై ప్రభావం చూపదని ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, జేడీయు నేత కేసీ త్యాగి చెప్పారు. భాగస్వామ్య పక్షాలను దూరంగా పెట్టి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం వల్లే కాంగ్రెస్‌ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొందని కేసీ త్యాగి విమర్శించారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేటప్పుడు యునైటెడ్‌ ఫ్రంట్‌ ఎంతో అవసరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గెలిచామని, తమను ఎవ్వరూ ఓడించలేరనే ధీమాతో వెళ్లడమే కాంగ్రెస్‌ పతనానికి దారితీసిందని తెలిపారు.

మూడు రాష్ట్రాల ఫలితాలు బీజేపీ విజయం కాదని, అది కాంగ్రెస్‌ వైఫల్యమేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత కునాల్‌ ఘోష్‌ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు తృణమూల్‌ తనవంతు కృషి చేస్తుందని చెప్పారు. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ ప్రాధాన్యం పెంచుకోవాలని చూసిందని ఆ కూటమికి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. అందుకే చాలాకాలంగా ఇండియా కూటమికి కాంగ్రెస్‌ దూరంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో తాజా ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనా తీరులో మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.

కలిసి వెళ్తే ఫలితం మారేది!
మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లాలని సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నించినప్పటికీ, పార్టీ చీఫ్​ కమల్‌నాథ్‌ తీరుతో అదికాస్త విఫలమైంది. దీంతో ఆ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఎస్​పీ అధికార ప్రతినిధి మనోజ్‌ యాదవ్‌ తమపై అవమానకర వ్యాఖ్యలు చేయడం వల్లే కాంగ్రెస్‌ భారీగా దెబ్బతిందని చెప్పారు. ఇదే విషయంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ఎస్​పీతో కాంగ్రెస్​ కలిసి వెళ్తే మధ్యప్రదేశ్‌ ఫలితం వేరేలా ఉండేదన్నారు. మిత్రపక్షాల విషయంలో తన దృక్పథాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, తాజా ఫలితాలు మాత్రం ఇండియా కూటమిలో ఎలాంటి చీలిక తేదని సంజయ్‌ రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు.

6న ఇండియా భేటీ
మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల కూటమి ఇండియాలోని సమన్వయ కమిటీ కేవలం ఒకేసారి సెప్టెంబర్‌ 13న భేటీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఇటువంటి సమావేశాలు మరిన్ని పెట్టాలని నిర్ణయించినప్పటికీ, పలువురు కాంగ్రెస్‌ నేతల విముఖతతో అది కాస్త వాయిదా పడింది. తాజాగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ మరో సమావేశానికి ఇండియా కూటమి సిద్ధమైంది. డిసెంబర్‌ 6న మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కావాలని నిర్ణయించింది.

''ఇండియా'ను ఏం చేద్దాం?'- ఎన్నికల ఫలితాలపై విపక్ష నేతల కీలక భేటీ

'ప్రజల మదిలో మోదీ'- చెక్కుచెదరని 'హిందుత్వ' పవర్! 2024లో బీజేపీని అడ్డుకునే 'శక్తి' ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.