ETV Bharat / bharat

India Alliance Coordination Committee : వీలైనంత వరకు ఉమ్మడి పోరు.. సెప్టెంబర్​ 30లోగా సీట్ల సర్దుబాటు.. 14 మందితో సమన్వయ కమిటీ - ఇండియా కూటమి చంద్రయాన్​ 3పై తీర్మానం

India Alliance Coordination Committee : లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల మధ్య ముంబయిలో సమావేశమైన విపక్ష కూటమి ఇండియా.. సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేయాలని తీర్మానం చేసింది. సెప్టెంబర్‌ 30 నాటికి కూటమిలో పార్టీల మధ్య అత్యంత కీలకమైన సీట్ల పంపకాల అంశం కొలిక్కి తెచ్చేందుకు 14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై ఈ భేటీలో సమాలోచనలు జరిపారు. బీజేపీని గద్దె దింపడమే ఇండియా కూటమి లక్ష్యమని విపక్ష నేతలు పునరుద్ఘాటించారు.

Opposition Meeting In Mumbai
Opposition Meeting In Mumbai
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 3:09 PM IST

Updated : Sep 1, 2023, 6:45 PM IST

India Alliance Coordination Committee : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీఏను ఢీకొట్టేందుకు ఏర్పాటైన విపక్ష కూటమి ఇండియా మూడో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన ఈ కీలక భేటీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా ఎన్డీఏపై ఉమ్మడి పోరుకు అత్యంత కీలకమైన సీట్ల పంపకాలపై సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులతో ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై ఈ కమిటీ త్వరితగతిన పని ప్రారంభించనుంది. ఈ ప్యానెల్‌లో కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌, NCP అధినేత శరద్‌ పవార్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఆర్​జేడీకి చెందిన తేజస్వీ యాదవ్‌, తృణమూల్‌ నేత అభిషేక్‌ బెనర్జీ, శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తదితరులు సభ్యులుగా ఉంటారు. విపక్ష కూటమి ఇండియాకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ కమిటీ తీసుకుంటుంది. ఈ నెల 30 కల్లా సీట్ల పంపకాల అంశం కొలిక్కి తేవాలని విపక్ష కూటమి నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని ఇండియా కూటమిలో తీర్మానం చేశారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సీట్ల పంపకాలు జరగాలని అందులో పేర్కొన్నారు. 'ఇండియా ఏకమౌతోంది, ఇండియా గెలుస్తుంది' అనే థీమ్‌తో సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి పోటీ చేయనుంది. ప్రజా సమస్యలపై దేశంలో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Opposition Meeting In Mumbai : విపక్ష కూటమి ఇండియా బలోపేతమవడం మోదీ సర్కారుకు ఆందోళన కలిగిస్తోందని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రతీకార రాజకీయాలకు బీజేపీ పాల్పడే ప్రమాదం ఉందని.. ఇందుకోసం విపక్ష నేతలపై దాడులకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఖర్గే హెచ్చరించారు. బీజేపీ నిరంకుశ పాలనలో సమాజంలో అన్ని వర్గాల వారు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నట్లు తెలిపారు. పేదల కోసం మోదీ ఎప్పుడూ పని చేయలేదని కార్పోరేట్ల పక్షానే నిలిచారని విమర్శించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై పోరాటమే తమ ఉమ్మడి లక్ష్యమన్నారు.

  • #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai

    "Today, without asking anyone, the opposition, a special session of Parliament has been called. A special session of Parliament was never called even when Manipur was burning, during the COVID-19… pic.twitter.com/wjwkDEMzPJ

    — ANI (@ANI) September 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇండియా కూటమిలోని పార్టీల ఉద్దేశం ఒక్కటే. అదేంటంటే పెరుగుతున్న ధరలను ఎలా నియంత్రించాలి, దీని కోసం ఎలా పోరాడాలి, నిరుద్యోగ నిర్మూలన కోసం ఎలా పోరాడాలి అనేది తేల్చుకోవడమే. ప్రస్తుతం పెట్రోల్‌, ఎల్‌పీజీ ధరలు దాదాపు రెండింతలు అయ్యాయి. మోదీ అన్నిసార్లు వంద రూపాయలు పెంచి రెండు రూపాయలు తగ్గిస్తారు. మోదీ పేద ప్రజల కోసం ఎప్పటికీ పని చేయరు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో కలిసి మెలిసి ఉంటారు. నిన్ననే రాహుల్ గాంధీ మీ ముందు ఓ నివేదిక గురించి ప్రస్తావించారు. అదానీ సంపద ఎలా పెరిగింది. పెరుగుదలకు ఎవరు కారణమయ్యారనే విషయాల్ని ఆయన తెలిపారు."

--మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

దేశ జనాభాలో 60 శాతం మందికి ఇండియా కూటమి ప్రాతినిధ్యం వహిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. కూటమి ఐక్యంగా ఉంటే ఎన్నికల్లో బీజేపీ నెగ్గడం అసాధ్యమన్నారు. ఇండియా కూటమి బీజేపీని ఓడిస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. ఇండియా కూటమి పార్టీల మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలున్నా తామంతా కలిసి పని చేస్తామన్నారు. దేశ ప్రగతిలో పేద ప్రజలను భాగస్వామ్యం చేయడమే తమ అభివృద్ధి మార్గమని వ్యాఖ్యానించారు.

  • #WATCH | Congress MP Rahul Gandhi says, "I spent a week in Ladakh. I went to Pangong Lake right in front of where the Chinese are. I had detailed discussions, probably the most detailed discussion that any politician outside Ladakh has had with the people of Ladakh. They… pic.twitter.com/neR3JPZ8ih

"మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వేదికపైన ఉన్నవారు.. 60 శాతానికి పైగా భారతీయ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న పార్టీలన్నీ కలిస్తే బీజేపీ ఎన్నికలలో గెలుపొందడం అసాధ్యం. కాబట్టి మన ముందన్న కర్తవ్యం ఏమిటంటే సాధ్యమైనంత ప్రభావవంతమైన మార్గంలో కలిసికట్టుగా రావడం. ఈ మేరకు రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. మొదటిది సమన్వయ కమిటీ, దాని కింద మిగిలిన కమిటీలు. రెండోది సీట్ల పంపకాలు, నిర్ణయాలను వేగవంతం చేసేందుకు నిర్ణయించాము."

--రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

ఇండియా కేవలం పార్టీల కూటమి కాదని.. 140 కోట్ల ప్రజల కూటమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అభివర్ణించారు. స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన అత్యంత అవినీతి, అహంకార ప్రభుత్వం మోదీ సర్కారని దుయ్యబట్టారు. నవభారత నిర్మాణానికి దేశ ప్రజలందరూ ఏకతాటిపైకి వస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వాన్ని ఇండియా కూటమి ఓడిస్తుందని స్పష్టం చేశారు.

  • #WATCH | AAP National Convenor & Delhi CM Arvind Kejriwal on INDIA alliance meeting

    "This is an alliance not just of some 28 parties, but an alliance of 140 crore people...Modi government is the most corrupt and arrogant government in the history of independent India. We are… pic.twitter.com/Dqek2ybyVx

"ఈ ఇండియా కూటమి కేవలం 27, 28 పార్టీల కూటమి కాదు.. 140 కోట్ల మంది ప్రజల కూటమి. నవభారత నిర్మాణానికి దేశ ప్రజలందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన అత్యంత అవినీతి, అహంకార ప్రభుత్వం మోదీ సర్కారు. ఇంత అహంకార ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. భగవంతుడి కంటే గొప్పగా తమను తాము భావిస్తున్నారు. ఇక్కడ ఎవరూ పదవులను ఆశించి రాలేదు. 140 కోట్ల భారతీయ ప్రజలను కాపాడటానికి వచ్చారు."

--అరవింద్ కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి

సార్వత్రిక ఎన్నికలు ముందుగానే నిర్వహించవచ్చని.. అందుకు తాము అప్రమత్తంగా ఉండాలని బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. 'ఇండియా' భాగస్వాములు వెంటనే ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని ప్రకటించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సూచించారు. రోజురోజుకు ఎన్డీఏ పతనమౌతోందని, ఇండియా బలోపేతం అవుతోందని అన్నారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచార కమిటీ, వర్కింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ సోషల్‌ మీడియా, వర్కింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ మీడియా, వర్కింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అని మరో నాలుగు కమిటీలను కూడా ఇండియా కూటమి ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ సమావేశంలో ఇండియా కూటమి లోగోను ఆవిష్కరిస్తారని తొలుత భావించినప్పటికీ.. ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

  • #WATCH | Bihar CM and JD(U) leader Nitish Kumar says, "...Parties are working together unitedly. So, as a result of this, those who are at the Centre will lose. They will go away. Be assured...You (media) are captive right now. Once you are free from them, you - the press - will… pic.twitter.com/53gmDcCin8

Opposition Meeting : ''ఇండియా' కూటమి 'బలం'.. మోదీ సర్కార్​కు భయం భయం!'

Opposition Meet : ముంబయిలో 'ఇండియా' కూటమి భేటీ.. శుక్రవారం ప్రెస్​మీట్​లో కీలక ప్రకటన!

Last Updated : Sep 1, 2023, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.