దాదాపు 70 ఏళ్ల తర్వాత చిరుత పులులు భారత్లో కనిపించనున్నాయి. ఈ మేరకు దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ).
మధ్యప్రదేశ్లోని కునో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోకి ఈ చిరుతలను తరలించనున్నట్లు ఎన్టీసీఏ పేర్కొంది. ఆగస్టు కల్లా చిరుత సంరక్షణకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులను సూచించినట్లు తెలిపింది. మొదటి బ్యాచ్ చిరుతలను నవంబర్ కల్లా స్వదేశానికి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
14 చిరుతలు..
మొదటి దశలో రూ. 14 కోట్లు విలువ చేసే 14 చిరుతలను భారత్కు తీసుకురానున్నారు. 2010లోనే భారత్కు చిరుతలను తీసుకురావాలని ప్రభుత్వం యోచించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇది ఆలస్యమైంది. ఎట్టకేలకు 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతితో భారత్ ముందడుగు వేసింది.
73 ఏళ్ల తర్వాత..
1947లో దేశంలో చివరిసారిగా చిరుత పులి ఆనవాళ్లు కనిపించాయని నిపుణులు చెబుతున్నారు. 1952లో దేశంలో చిరుతుపులులు అంతరించిపోయినట్లు వెల్లడైంది.
ఇదీ చదవండి:సొరంగం కూలి నలుగురు మృతి