వచ్చే ఏడాది జులై-ఆగస్టు కల్లా కొవిడ్ టీకాను 20 నుంచి 25 లక్షల మందికి అందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో ఆరోగ్య సేవా సిబ్బందికి, పెద్ద వయస్కులకు ఈ టీకాను అందించనున్నట్లు అధికారులు తెలిపారు
" దేశీయ కొవిడ్ వ్యాక్సిన్ తయారీ విజయవంతం చేసేందుకు భారత్ చురుగ్గా పనిచేస్తోంది. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి".
- ఓ వైద్యాధికారి.
రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ...
ఇటీవలే కేంద్ర ఆరోగ్య ప్రతినిధి రాజేశ్ భూషణ్ పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రతి ప్రాంతంలో 'ఇమ్యూనైజేషన్ మానిటరింగ్ సెల్' ఏర్పాటు చేయాలని కోరారు. వ్యాక్సిన్ మొదటగా ఆరోగ్య సేవలందిస్తోన్న సిబ్బందికి, వయసు పైబడినవారికి అందించనున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు.
" వచ్చే ఏడాది తొలి దశలో భారత్ చేస్తోన్న కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చు. దీనికోసం భారత శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్‌లోనూ భారత కొవాగ్సిన్ మెరుగైన ఫలితాలు ఇస్తోంది".
- డాక్టర్. జ్ఞాని, అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ డీజీ.