బుధవారం.. శ్రీరామ నవమి సందర్బంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు చెప్పారు. శ్రీరాముడి ఆదర్శాలను ప్రజలంతా తమ జీవితాల్లోనూ అలవర్చుకునేలా ప్రతిజ్ఞ చేయాలని కోరారు. తద్వారా అద్భుతమైన భారత్‌ను నిర్మించే దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు.
"న్యాయం, గౌరవం కోసం పోరాడే మనం.. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి బోధనలను అనుసరించాలి. సద్గుణాలతో ఎలా జీవించాలో రాముడు మనకు బోధించాడు. రాముడి జీవితం, ఆయన అనుసరించిన ధర్మం, నిజాయతీ మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున ఆయన ఆదర్శాలను పాటించేలా మనం ప్రతిజ్ఞ చేద్దాం."
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
రాముడు జన్మించిన రోజును శ్రీరామ నవమిగా ప్రజలు జరుపుకుంటారని కోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటనను.. రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది.
ఇదీ చూడండి: 'కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం బూటకం'
ఇదీ చూడండి: టీకా తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రధాని భేటీ