Income Tax Raid Tamil Nadu: తమిళనాడులోని ప్రముఖ రిటైల్ సంస్థ శరవణ స్టోర్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.1000 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు ఐటీ శాఖ తెలిపింది. గత కొన్నేళ్లుగా పలు క్రయవిక్రయాలకు సంబంధించి సంస్థ అవకతవకలకు పాల్పడిందని అధికారులు తెలిపారు.
"గత కొన్నేళ్లుగా పలు క్రయవిక్రయాల్లో రూ.1000 కోట్లకుపైగా సంస్థ అవకతవకలకు పాల్పడింది. టెక్స్‌టైల్, జ్యువెలరీ విభాగాల్లో దాదాపు రూ.150 కోట్ల లెక్కలు చూపని కొనుగోళ్లు చేసినట్లు గుర్తించాం" అని అధికారులు పేర్కొన్నారు.
డిసెంబరు 1న చెన్నై, కోయంబత్తూర్, మదురై, తిరునెల్వేలి సహా రాష్ట్రవ్యాప్తంగా సంస్థకు చెందిన 37 ప్రదేశాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.10 కోట్ల నగదు, రూ.6 కోట్లు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో 100 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: చిన్నారిపై అత్యాచారం.. నెలరోజుల్లో 'ఉరి' తీర్పు!