ఎన్నికల నేపథ్యంలో డీఎంకే నేతలపై ఐటీ సోదాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి చెందిన పలు కార్యాలయాలు, ఇళ్లపై శుక్రవారం దాడులు నిర్వహించింది ఆదాయపన్ను శాఖ. తొలుత డీఎంకే అధినేత స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఆస్తులపై ఐటీ శాఖ సోదాలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో ఐటీ శాఖ తీరును తప్పుపట్టారు డీఎంకే నేతలు. ఐటీ శాఖ 'అధికార దుర్వినియోగం' చేస్తోందని అన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం కోసమే ఈ సోదాలు జరుపుతోందని ఆరోపించారు. భాజపా ఇందుకు మద్దుతుగా నిలుస్తోందన్నారు.
"అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కాపాడేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోంది. ఐటీ శాఖను, సీబీఐని అస్త్రంగా ఉపయోగిస్తోంది. కానీ, ఇది డీఎంకే. నేను కలైంగర్ తనయుడిని. వీటికి భయపడను."
- ఎంకే స్టాలిన్, డీఎంకే అధినేత.
ఐటీ దాడులు చేస్తామని బెదిరిస్తే అన్నాడీఎంకే తలొగ్గుద్దేమో గానీ డీఎంకే తలవంచదని స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెరంబలూర్ ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు.
ఇదీ చదవండి:బైడెన్ ఆహ్వానాన్ని అంగీకరించిన మోదీ