ETV Bharat / bharat

సూపర్​స్టార్​ రజినీకి ప్రతిష్ఠాత్మక అవార్డు

Rajinikanth income tax award: తమిళనాడులోనే అత్యధికంగా పన్నును చెల్లిస్తున్నందుకు గాను సూపర్​స్టార్ రజినీకాంత్​కు ఆదాయపు పన్ను శాఖ అవార్డు ఇచ్చింది. పుదుచ్చేరి గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ అవార్డును బహూకరించారు.​

rajinikanth income tax award
rajinikanth income tax award
author img

By

Published : Jul 24, 2022, 3:42 PM IST

Rajinikanth income tax award: నటుడు సూపర్​స్టార్​ రజినీకాంత్​కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో అత్యధికంగా ఆదాయపు పన్నును చెల్లిస్తున్నందుకుగాను.. ఆ శాఖ ప్రతిష్ఠాత్మక అవార్డును రజనీకి ప్రదానం చేసింది. చెన్నైలో జరిగిన ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

rajinikanth income tax award
అవార్డును స్వీకరిస్తున్న రజినీ కుమార్తె ఐశ్వర్య

అయితే, ఈ కార్యక్రమానికి రజినీకాంత్​ హాజరుకాలేదు. ఆయన స్థానంలో పెద్ద కూతురు ఐశ్వర్య ఈ అవార్డును స్వీకరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తమిళసై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర కృషి వల్లే ప్రజలు పన్నులు కట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలని కోరారు. పన్నులు చెల్లించకపోతే మనం ఉనికిని కోల్పోతామని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చదవండి: తాచు పాముకు యాక్సిడెంట్.. హుటాహుటిన ఆస్పత్రికి.. తలకు సర్జరీ!

బర్త్​డే పార్టీకి వెళ్లొస్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.