ETV Bharat / bharat

కరోనా 2.0: థియేటర్లలో మళ్లీ 50% రూల్​ - maharashtra covid orders

భారత్​లో కొవిడ్​ వ్యాప్తి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తున్నందున వివిధ రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. మహారాష్ట్రలో 50 శాతం సామర్థ్యంతోనే థియేటర్లు తెరవాలని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పంజాబ్​లో మార్చి 31 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

covid new ruels in states
కొవిడ్​ విజృంభణ- ఆంక్షల్లోకి రాష్ట్రాలు
author img

By

Published : Mar 19, 2021, 4:23 PM IST

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు.. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. మహారాష్ట్రలో మార్చి 31 వరకు నూతన ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని థియేటర్లు, ఆడిటోరియంలు.. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడుస్తాయని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మాస్కులు సరిగా ధరించనివారికి అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. అన్ని ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం మంది సిబ్బంది మాత్రమే హాజరు కావాలని పేర్కొంది.

covid new ruels in maharashtra
మహారాష్ట్ర ప్రభుత్వ కొవిడ్​ నూతన నిబంధనలు

పంజాబ్​లో విద్యాసంస్థలు బంద్​

పంజాబ్​లో కరోనా కేసులు పెరుగుతున్నందున మార్చి 31 వరకు మెడికల్​, నర్సింగ్​ కాలేజీలు మినహా.. అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ తెలిపారు. 50 శాతం సామర్థ్యంతోనే సినిమా హాళ్లు నడుస్తాయని తెలిపారు.

వైరస్​ వ్యాప్తిని నిలువరించేందుకు ఇళ్లలో పది కంటే ఎక్కువగా మంది గుమికూడవద్దని అమరీందర్​ సింగ్ కోరారు. రాష్ట్రంలోని 20 కరోనా ప్రభావిత జిల్లాల్లో సామాజిక సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. వివాహాలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని తెలిపారు. ఆయా జిల్లాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు.

ఇదీ చూడండి:కొవిడ్ విజృంభణ-కొత్తగా 40వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.