ETV Bharat / bharat

Rape: నలుగురు మైనర్లపై అత్యాచారం - త్రిపుర గ్యాంగ్ రేప్ న్యూస్

త్రిపుర అగర్తలాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు మైనర్లను రేప్​ చేశారు ఏడుగురు నిందితులు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులందరిని అరెస్టు చేశారు పోలీసులు.

minors, rape
గ్యాంగ్ రేప్, మైనర్లపై అత్యాచారం
author img

By

Published : Jun 15, 2021, 7:40 AM IST

త్రిపుర అగర్తలాలో దారుణ ఘటన జరిగింది. నలుగురు మైనర్లపై అత్యాచారానికి(gang rape in Tripura) పాల్పడ్డారు కొందరు యువకులు.

ఇదీ జరిగింది...

నలుగురు మైనర్లతో సన్నిహితంగా ఉండే ఏడుగురు మిత్రులే ఈ దారుణానికి పాల్పడ్డారు. తొలుత.. సరదాగా బయటకు వెళ్దామని నిందితులు.. వారిని ఆహ్వానించినట్లు సమాచారం. అనంతరం వారిని ఓ తోటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

తోటకు వెళ్లిన తర్వాత నిందితులు ఆ మైనర్లను దారుణంగా కొట్టారు. ఆదివారం రాత్రంతా వేధించారు. ఎట్టకేలకు బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24గంటల్లో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. సోమవారం వారిని కోర్టు ముందు హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. నిందితులందరూ 19-21 మధ్య వయస్కులే అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:Rape: బాలికపై ఏడుగురు మైనర్లు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.