ETV Bharat / bharat

8 ఏళ్ల బాలుడు.. అర్ధరాత్రి సైకిల్​పై 92 కి.మీ... చివరకు... - తమిళనాడు విల్లుపురం న్యూస్

తోటిపిల్లలతో సరదాగా ఆడుతూపాడుతూ తిరిగే ఓ బాలుడు తన తల్లిని కలుసుకునేందుకు పెద్ద సాహసమే చేశాడు. తండ్రితో గొడవ పెట్టుకుని అమ్మమ్మ ఊరికి వెళ్లిన తల్లి కోసం రాత్రిపూట సైకిల్​పై బయలుదేరాడు. ఇంతకూ ఆ చిన్నోడు తన తల్లిని చేరుకోగలిగాడా?

tamilnadu
tamilnadu
author img

By

Published : Aug 10, 2021, 3:43 PM IST

ఎనిమిదేళ్ల బాలుడు పెద్ద సాహసమే చేశాడు. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శబరీనాథ్ అనే బాలుడు తన తల్లిని వెదుకుతూ రాత్రిపూట సైకిల్​పై 92 కిలోమీటర్ల ప్రయాణానికి ఉపక్రమించాడు.

ఇదీ జరిగింది..

తమిళనాడు విల్లుపురంలోని తిండివనంలో విలేజ్​ అసిస్టెంట్​ రఘురామన్​-రాజేశ్వరి భార్యాభర్తలు. నెలరోజులు క్రితం వీరి మధ్య వచ్చిన ఓ చిన్న తగాదా పెద్ద గొడవగా మారింది. దీంతో రాజేశ్వరి కల్లకురిచిలోని తన పుట్టింటికి వెళ్లింది. అమ్మ తిరిగి వస్తుందని ఎదురుచూసిన చిన్న కొడుకు శబరీనాథ్​ ఎంతకీ రాకపోగా డీలాపడ్డాడు.

శబరీనాథ్
శబరీనాథ్
శబరీనాథ్
శబరీనాథ్ ఉపయోగించిన సైకిల్​

సైకిల్​పైనే..

దీనితో అమ్మను ఎలాగైనా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా సోమవారం రాత్రి తన అమ్మమ్మ వాళ్లింటికి బయలుదేరాడు. తిండివనం నుంచి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లకురిచికి వెళ్లేందుకు స్నేహితుడి వద్ద సైకిల్ తీసుకున్నాడు. విల్లుపురం-నాగపట్టణం జాతీయ రహదారిపై అప్పటికే 14 కి.మీ ప్రయాణించిన బాలుడిని పోలీసులు గుర్తించారు. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నావంటూ అడిగారు.

తమిళనాడు
శబరీనాథ్​ను తండ్రికి అప్పగిస్తున్న పోలీసులు

బాలుడు చెప్పిన విషయం విని చలించిపోయారు. ఆ సమయంలో బాలుడు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితం కాదని భావించి.. తండ్రిని పిలిపించి అప్పగించారు. అనంతరం సమాచారం తెలుకున్న తల్లి రాజేశ్వరి సైతం ఇంటికి వచ్చి కుమారుడిని కలుసుకుంది. బాలుడి ప్రేమకు ఉప్పొంగిపోయింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.