ముంబయిలోని హొర్లీలో ఘోర ప్రమాదం జరిగింది. భవనం లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోగా.. ఐదుగురు మృతి చెందినట్లు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది.
నిర్మాణంలో ఉన్న భవనంలో ఈ ప్రమాదం జరిగిందని బీఎంసీ తెలిపింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి:పిడుగుపాటుకు ఐదుగురు బలి