బిహార్లో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో అరారియా జిల్లాలోని పోక్సో కోర్టు రికార్డ్ సృష్టించింది. కేవలం ఒకే రోజు విచారణ జరిపి దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దేశంలో ఇంతవేగంగా తీర్పు వెలువడిన కేసు ఇదే మొదటిది. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ శశికాంత్ రాయ్.. దోషికి రూ.50,000 జరిమానా సైతం విధించారు. బాలిక పునరావాసానికి రూ.7లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
బాలికపై ఈ ఏడాది జులై 22న అత్యాచారం జరిగింది. మరుసటి రోజే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కోర్టు విచారణకు వచ్చిన ఈ కేసులో.. సాక్షుల రికార్డింగ్, వాదనలు, ప్రతివాదనలు, దోషిగా తేల్చడం, తీర్పు అన్ని ఒకే రోజు పూర్తయ్యాయి. అక్టోబర్ 4న కోర్టు ఆదేశాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ నవంబర్ 26న బయటికి వచ్చింది.
మధ్యప్రదేశ్లో 2018 నాటి దతియా జిల్లా రేప్ కేసులో పోక్సో కోర్టు దోషికి మూడు రోజుల్లో తీర్పు వెలువరించింది. ఇప్పటివరకు అత్యంత వేగంగా తీర్పు వచ్చిన కేసు ఇదే.
ఇదీ చదవండి:చెల్లెలిపై మూడు నెలలుగా అన్న అత్యాచారం.. చివరకు..