ETV Bharat / bharat

కూచ్​ బిహార్​ కాల్పులే ప్రచారాస్త్రం!

author img

By

Published : Apr 10, 2021, 11:01 PM IST

బంగాల్​లో‌ నాల్గో విడత ఎన్నికల సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. మూడోసారి అధికారం నిలబెట్టుకోవాలని సీఎం మమతాబెనర్జీ..ఎలాగైనా కాషాయజెండా ఎగురవేయాలన్న భాజపా..కాల్పుల ఘటనను ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. ఓటమి భయంతోనే సీఎం మమతా బెనర్జీ గూండాలను ఉసిగొల్పుతున్నారని భాజపా ఆరోపించింది. అడ్డదారుల్లో అధికారం చేపట్టేందుకు కమలనాథులు కుట్రలు చేస్తున్నారని టీఎంసీ విమర్శించింది.

TMC-BJP-MSN
కూచ్​ బిహార్​ కాల్పులే ప్రచారాస్త్రం!

బంగాల్‌లో అధికార టీఎంసీ, భాజపా మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరాయి. ఎన్నికలకు ముందునుంచే మాటలయుద్ధం మొదలుపెట్టిన ఇరుపార్టీలు నాలుగుదశల ఎన్నికలు ముగియటంతో.. విమర్శలదాడి మరింత పెంచాయి. 'నువ్వు ఒకటంటే నేను రెండంటా' అనే విధంగా ఆయా పార్టీల నేతల వైఖరి కనిపిస్తోంది. ప్రతి అంశంలో ప్రత్యర్థిని ఇరుకునపెట్టే వ్యూహంతో ప్రచారం నిర్వహిస్తున్న ఇరు పార్టీలు.. నాల్గోదశ పోలింగ్‌ సందర్భంగా జరిగిన కూచ్‌ బెహార్‌ కాల్పుల ఘటనను.. అనుకూలంగా మార్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

ఓటమి భయంతోనే అధికార టీఎంసీ గూండాలు భద్రతాదళాలపై దాడులకు తెగబడుతున్నారని కమలనాథులు ఆరోపించారు . కేంద్ర బలగాల అండతో బంగాల్‌లో అధికారంపీఠం కైవసానికి భాజపాకుట్ర చేస్తోందని సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు.

'భద్రతా సిబ్బందిపై టీఎంసీ గూండాల దాడి'

ఐదో విడత ఎన్నికల్లో భాగంగా సిలిగురిలో ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. కూచ్‌ బెహార్‌ ఘటనను ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడడం ద్వారా..బంగాల్లో భాజపా విజయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. కూచ్ బెహార్ కాల్పుల ఘటనపై ప్రధాని విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తొలి నాలుగు దశల పోలింగ్‌లో ఓటర్లు భాజపాకు అనుకూలంగా నిలిచారని, తమ పార్టీ మెజార్టీ సాధించటం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. ఓటమి తప్పదన్న భయంతోనే అధికార టీఎంసీ గూండాలు భద్రతాసిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. దాడులకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ కోరారు.

"భాజపాకు లభిస్తున్న ప్రజాదరణను చూసి.. దీదీ, ఆమె గూండాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికార పీఠం కదిలిపోతోందని గమనించి దాడులు చేసే స్థాయికి దిగజారారు. దీదీ, ఆమె గూండాలకు ఓ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాను. దీదీ.. మీ అరాచకాలను బంగాల్‌లో ఇకపై సాగనీయ్యం. హింసకు పాల్పడడం, ప్రజలను భద్రతా సిబ్బందిపైకి ఉసిగొల్పడం, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం వంటి చర్యలు మిమ్మల్ని కాపాడలేవు. మీ పదేళ్ల పాలనా వైఫల్యాలను ఈ హింస ఏమాత్రం రక్షించదు."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

'ఓటేసి ప్రతీకారం తీర్చుకోవాలి'

కూచ్‌బెహార్‌ కాల్పుల ఘటనపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హింగాల్‌గంజ్‌లో ఎన్నికలప్రచారంలో పాల్గొన్న ఆమె.. కాల్పుల ఘటనను పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనకు బాధ్యతగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు అమాయకుల ప్రాణాలు ఎలా పోయాయో సమాధానం చెప్పాలన్నారు. ఆత్మరక్షణ కోసమే సీఐఎస్​ఎఫ్​ కాల్పులు జరిపిందన్న ఈసీ ప్రకటనను మమత తప్పుపట్టారు. ఓడిపోతామన్న భయంతోనే భాజపా..కేంద్రబలగాలతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. బంగాల్‌లో కేంద్రబలగాల తీరును చూసి ఇలాంటి పరిస్ధితి వస్తుందని చాలారోజుల నుంచి చెబుతున్నట్లు తెలిపారు. ప్రజలు శాంతియుతంగా ఓటేసి ఈ మరణాలకు ప్రతీకారం తీర్చుకోవాలని మమత సూచించారు.

ఇదీ చదవండి: టీఎంసీకి చేటు చేస్తున్న దీదీ వ్యాఖ్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.