ETV Bharat / bharat

ఆర్మీ కీలక విభాగంలోకి ఐదుగురు వనితలు.. తండ్రి కోరికపై సాక్షి.. భర్త ఆశయంతో రేఖ..! - ఆర్మీ మహిళా అధికారులు

చరిత్రలో తొలిసారిగా భారత సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్​కు ఐదుగురు మహిళా అధికారులు నియమితులయ్యారు. అందులో తండ్రి కోరికపై ఒకరు.. భర్త ఆశయంతో మరొకరు.. ఆర్మీలో చేరామని చెబుతున్నారు. వారి గురించి తెలుసుకుందాం.

In a historic first time the Indian Army commissioned five women officers to its Regiment of Artillery

author img

By

Published : Apr 29, 2023, 4:15 PM IST

భారత సైన్యంలో కీలక విభాగమైన ఆర్టిలరీ రెజిమెంట్​లోకి చరిత్రలో తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులు నియమితులయ్యారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో శిక్షణను విజయవంతంగా ముగించుకుని ఐదుగురు వనితలు ఆర్మీలో చేరారు. వారిలో ముగ్గురు ఉత్తర సరిహద్దులకు.. మరో ఇద్దరు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లనున్నారు. శనివారం చెన్నైలో జరిగిన కమిషన్​ వేడుకలో యువ మహిళా క్యాడెట్లు రాజ్యాంగ విధేయతతో ప్రమాణం చేసి వారి ర్యాంక్ చిహ్నాలను స్వీకరించారు. ఐదుగురు మహిళలతో పాటు మరో 19 మంది పురుషులు కూడా రెజిమెంట్​లోకి చేరారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ అదోష్ కుమార్​తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

వీరిలో లెఫ్టినెంట్ మెహక్ సైనీ SATA రెజిమెంట్‌లో నియమితులయ్యారు. లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్ ఫీల్డ్ రెజిమెంట్‌లుగా.. లెఫ్టినెంట్ పయస్ ముద్గిల్ మీడియం రెజిమెంట్‌గా, లెఫ్టినెంట్ ఆకాంక్ష రాకెట్ రెజిమెంట్‌గా చేరారు. భారత సైన్యంలో ఆర్టిలరీ రెజిమెంట్ అనేది కీలకమైన రెండో అతిపెద్ద విభాగం. క్షిపణులు, తుపాకులు, మోర్టార్‌లు, రాకెట్ లాంచర్లు, మానవరహిత వైమానిక వాహనాలతో ఆర్టిలరీ మందుగుండు సామగ్రి అక్కడ ఉంటాయి.

ఆర్టిలరీ రెజిమెంట్‌కు మహిళా అధికారులను నియమించడం భారత సైన్యం ప్రగతిశీల అభివృద్ధికి నిదర్శనం. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జనవరిలో మహిళా అధికారులను ఆర్టిలరీ యూనిట్లలోకి నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

నాన్న కోరిక మేరకు..
"ఆర్మీలో చేరాలని చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ప్రేరేపించారు. మహిళా అభ్యర్థులకు ఆర్మీ అవకాశం ఇచ్చింది. సైన్యంలో చేరడం మిమ్మల్ని మీరు ఏంటనేది తెలుసుకోవడంలో ఆర్మీ సహాయపడుతుంది" అని లెఫ్టినెంట్ సాక్షి బుబే చెప్పారు.

In a historic first time the Indian Army commissioned five women officers to its Regiment of Artillery
లెఫ్టినెంట్ సాక్షి బుబే

భర్త మరణించిన తర్వాత..
"నా భర్త మరణించిన తర్వాత నేను ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం సిద్ధమవ్వడం ప్రారంభించాను. ఈ రోజు నా శిక్షణ పూర్తయింది. నేను లెఫ్టినెంట్ అయ్యాను. అందుకు చాలా గర్వపడుతున్నాను. అక్కడ ఉన్న మహిళా అభ్యర్థులందరూ తమను తాము విశ్వసించాలని.. ఇతరులు ఏమి చెబుతారనే దాని గురించి ఆలోచించకుండా వారు చేయాలనుకున్నది చేయాలని నేను సలహా ఇస్తున్నాను" అని లెఫ్టినెంట్ రేఖా సింగ్ తెలిపారు.

లెఫ్టినెంట్ రేఖా సింగ్

తల్లితనాన్ని వదులుకుని ఆర్మీ ఆఫీసర్లుగా
గతేడాది అక్టోబర్​లో దేశ సేవకై ప్రాణాలు అర్పించిన భర్తల ఆశయాలను నేరవేర్చేందుకు తమ తల్లితనాన్ని వదులుకుని ఆర్మీ ఆఫీసర్లుగా మారారు ఇద్దరు వీర వనితలు. చెన్నైలో జరిగిన ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ల ఉత్తీర్ణత సాధించి ఆర్మీలోకి ప్రవేశించారు హర్వీన్​ కలోన్​, రిజిన్​ చోరోల్. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.