దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో ఓ వెండి దేవాలయ నిర్మాణం జరగబోతోంది. బాందా జిల్లాలోని టీకమ్గఢ్లో రూ.200 కోట్ల వ్యయంతో ఐదేళ్లలో ఈ జైన మందిరాన్ని నిర్మించనున్నారు. దానికోసం జైసల్మేర్ నుంచి పసుపు పాలరాతిని వాడనున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్(రూపశిల్పి) ఈ కోవెల ఆకృతిని రూపొందించారు.
టీకమ్గఢ్ జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 2 క్వింటాళ్ల చొప్పున బరువు గల 24 యాత్రికుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రదీప్ జైన్ తెలిపారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ సూచనల మేరకు దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: సొంత డబ్బుతో 400 టన్నుల ప్రాణవాయువు