వన్య మృగాల సంరక్షణ కోసం అసోంలోని కాజీరంగా జాతీయ పార్కు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా శాటిలైట్ ఫోన్లను ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పార్కులోని వన్య మృగాలకు పటిష్ఠ భద్రత కల్పించే అవకాశం ఉందని ఉద్యానవన అధికారులు తెలిపారు.
అటవీ సిబ్బందికి 10 ఫోన్లను అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా బుధవారం అందజేశారు. రూ.16 లక్షల అంచనా వ్యయంతో అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వీటిని కొనుగోలు చేసింది. బీఎస్ఎన్ఎల్ సంస్థ వీటికి సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఫోన్ల వాడకంపై పార్కు సిబ్బందికి బీఎస్ఎన్ఎల్ సంస్థ శిక్షణ ఇచ్చింది.
దాదాపు 2,500 ఖడ్గమృగాలకు ఆవాసమైన.. కాజీరంగా జాతీయ పార్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఇదీ చూడండి: మరో 3 ప్రాంతాల్లో సుప్రీం కోర్టు బెంచ్‌లు- నిజమేనా?
ఇదీ చూడండి: ఆ దేశాల నుంచే ఎక్కువ పోర్న్.. మన స్థానం ఎంతంటే?