Organ transplantation: అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలిస్తారు. వీటిని ఇమ్యునోసప్రసెంట్స్ అంటారు. వీటి మోతాదులను ఇప్పటివరకు శరీర బరువు ఆధారంగా నిర్ధరిస్తున్నారు. అయితే కేరళలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ) శాస్త్రవేత్తలు.. ఈ మోతాదు నిర్ధరణకు కొత్త ప్రక్రియను కనుగొన్నారు. రోగి జన్యుపరిణామక్రమాన్ని విశ్లేషించి.. దాని ఆధారంగా ఔషధ మోతాదును కచ్చితంగా నిర్ధరించవచ్చని వీరంటున్నారు.
Immunosuppressant: ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఇమ్యూనోసప్రసెంట్ ఔషధం టెక్రోలమస్ మోతాదుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని తగ్గించడానికి ఈ ఔషధాన్నిస్తారు. "ఇంతకుముందు సరైన మోతాదు నిర్ధరించేందుకు చాలా ప్రయోగాలు జరిగాయి. డీఎన్‌ఏ విశ్లేషణ ద్వారా మోతాదు ఎక్కువ ఇవ్వకుండా నిరోధించగలుగుతాం. ఇది చాలా మంది రోగులకు సాయపడుతుంది" అని పరిశోధనలో పాల్గొన్న ఆర్‌జీసీబీ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రభాస్ నారాయణ తెలిపారు.
ఇదీ చూడండి: గుండెకు కరోనా ముప్పు..కాపాడుకోండి ఇలా!
ఇదీ చూడండి: organ donation: తాను వెళ్లి.. తనువులో మళ్లీ..!