సెప్టెంబర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ సంస్థ(IMD) తెలిపింది. అయితే ఉత్తర భారతదేశంతో పాటు ఈశాన్య, దక్షిణ భారత్లోని కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉండొచ్చని ఐఎండీ వెల్లడించింది.
"సెప్టెంబరులో మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రుతుపవనాల కదలిక తొమ్మిది శాతం తక్కువగా ఉంది. అయితే సెప్టెంబర్‌లో నమోదయ్యే మంచి వర్షపాతంతో ఈ లోటు తగ్గుతుందని ఆశిస్తున్నాం."
-మృతుంజయ్ మొహపాత్ర, ఐఎండీ డైరెక్టర్ జనరల్
ఆగస్టులో సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని ఐఎండీ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. గత నెలలో 24 శాతం లోటు నమోదైంది. జులైలో వర్షపాతం లోటు ఏడు శాతంగా ఉంది.
ఇవీ చదవండి: