దక్షిణ భారతదేశాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. తమిళనాడు (Tamilnadu rain), కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొద్దిరోజులుగా వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల చెన్నై నగరం (Rains in chennai) వరదల్లో మునిగిపోయింది. మరికొన్నిరోజులు ఈ తిప్పలు తప్పేలా లేవు.
తమిళనాడులో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) (Imd rain forecast) హెచ్చరించింది.
23, 24 తేదీల్లో ఎల్లో అలర్ట్, 25, 26 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, కరైకల్‌లో కూడా రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ.
కూలిన ఇళ్లు..
తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు.. సాలెం జిల్లా కరుంగల్పట్టిలో మంగళవారం ఉదయం 4 ఇళ్లు కూలిపోయాయి. 13 మందిని రక్షించి.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: వర్ష బీభత్సం- 5 లక్షల ఎకరాల పంట నష్టం