ETV Bharat / bharat

'కొరొనిల్​'తో కేంద్ర ఆరోగ్య మంత్రికి చిక్కులు!

కొరొనిల్​ టాబ్లెట్​పై వివరణ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ను ఐఎంఏ డిమాండ్​ చేసింది. తమ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిందని పతంజలి సంస్థ చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

IMA 'shocked' over Patanjali's claim on Coronil
కొరొనిల్​ విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రికి చిక్కులు!
author img

By

Published : Feb 22, 2021, 4:12 PM IST

పతంజలి సంస్థ విడుదల చేసిన కొరొనిల్​ టాబ్లెట్​పై ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్(ఐఎంఏ)​ విస్మయం వ్యక్తం చేసింది. కరోనా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన తమ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ధ్రువీకరించిందని చెప్పడాన్ని తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని.. ఈ ఔషధ ఆవిష్కార కార్యక్రమానికి హాజరైన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ను డిమాండ్​ చేసింది.

"వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో ఉండి ఒక తప్పుడు, అశాస్త్రీయమైన వస్తువును ఎలా దేశ ప్రజల కోసం విడుదల చేస్తారు? కరోనాను ఎదుర్కొనే ఔషధం అని చెప్పేందుకు దీనిపై జరిగిన క్లినికల్​ ట్రయల్స్​ గురించి వివరిస్తారా? మంత్రి నుంచి దేశ ప్రజలకు వివరణ కావాలి. దీనిని సుమోటోగా తీసుకోవాలని జాతీయ వైద్య మండలికి మేము లేఖ రాశాం. కొరొనిల్​ను డబ్ల్యూహెచ్​ఓ ధ్రువీకరించిందన్న విషయాన్ని తెలుసుకుని మేం ఆశ్చర్యానికి గురయ్యాం."

-- ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​.

ఫిబ్రవరి 19న ఈ కొరొనిల్​ టాబ్లెట్​ను యోగా గురు బాబా రామ్​ దేవ్​ ఆవిష్కరించారు. తమ సంస్థ విడుదల చేస్తున్న ఈ ఔషధానికి డబ్ల్యూహెచ్​ఏ ధ్రువీకరణ స్కీమ్​లో భాగంగా.. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన ఆయుష్​ విభాగం ఆమోదించిందని చెప్పారు.

కొవిడ్​కు సంబంధించి ఎలాంటి సంప్రదాయ ఔషధాలను తాము అనుమతి ఇవ్వలేదని ట్విట్టర్​ వేదికగా డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసిన అనంతరం కొరొనిల్​ వ్యవహారంపై ఐఎంఏ దృష్టి సారించింది.

అలాంటిదేం లేదు..

కొరొనిల్​ ఔషధం విషయంలో నెలకొన్న ఈ అనిశ్చితిపై పతంజలి మేనేజింగ్​ డైరెక్టర్​ బాలకృష్ణ ట్విట్టర్​ వేదికగా వివరణ ఇచ్చారు. డబ్ల్యూహెచ్​ఓ ఎలాంటి ఔషధాలకు అనుమతి ఇవ్వదని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు డబ్ల్యూహెచ్​ఓ కృషి చేస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి:బొగ్గు చౌర్యం కేసులో గంభీర్​కు సీబీఐ ఉచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.