ETV Bharat / bharat

బాబా రాందేవ్​కు ఐఎంఏ సవాల్​!

బాబా రాందేవ్​ బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చింది భారత వైద్య సంఘం(IMA). పతంజలి ఔషధాలతో కరోనా చికిత్స చేస్తున్న అల్లోపతి ఆసుపత్రుల వివరాలు చెప్పాలని పేర్కొంది.

బాబా రాందేవ్​, ima on patanjali medicines
'బాబా మీరు సమాధానం చెప్తారా?'
author img

By

Published : May 29, 2021, 3:01 PM IST

యోగా గురు బాబా రాందేవ్​కు(Baba Ramdev)​ భారతీయ వైద్య సంఘం(IMA) మధ్య వివాదం కొనసాగుతోంది. బహిరంగ చర్చకు రావాలని ఐఎంఏ ఉత్తరాఖండ్​ సవాల్​ విసిరింది. కొవిడ్​ రోగుల చికిత్సలో భాగంగా పతంజలి మందులు ఇస్తున్నారని పేర్కొన్న అల్లోపతి ఆసుపత్రులేవో వెల్లడించాలని డిమాండ్​ చేసింది. ఈ మేరకు బాబా రాందేవ్​కు లేఖ రాసింది ఐఎంఏ.

"మీరు బహిరంగంగా 25 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు మా వంతు. మా నిపుణుల ప్రశ్నలకు మీరు, మీ బృందం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పతంజలి యోగ్​పీఠ్​ నిర్వహిస్తున్న పరిశోధనల్లో భాగంగా ఆ సంస్థకు చెందిన మందులను ఇస్తున్న అల్లోపతి ఆసుపత్రుల వివరాలు చెప్పాలి."

-డాక్టర్​ అజయ్​ ఖన్నా, ఐఎంఏ ఉత్తరాఖండ్​ కార్యదర్శి

పతంజలి మందులు సమర్థవంతమైనవని, వీటిని అల్లోపతి ఆసుపత్రులలోని రోగులపై ప్రయోగించి చూశామని బాబా రాందేవ్​ ఇటీవల పేర్కొన్నారు. అలాగే.. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన క్రమంలో ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపిన రాందేవ్​.. 25 ప్రశ్నలను సంధించారు. వాటికి అల్లోపతిలో చికిత్స ఉందా? పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'అల్లోపతి డాక్టర్లను ఆయుర్వేద వైద్యులుగా మార్చేస్తా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.