ETV Bharat / bharat

'జయలలిత వారసురాలిని నేనే.. శశికళను కలుస్తా ' - జయలలిత కుమార్తె చెన్నై

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిని తానేనంటూ చెన్నైకు చెందిన ఓ మహిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగురోజుల్లో శశికళను కలుస్తానని చెప్పుకొచ్చారు.

Jayalalitha
జయలలిత
author img

By

Published : Nov 6, 2021, 10:22 PM IST

తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తాను.. వెనుక గుమ్మం నుంచి వెళ్లి కలిశానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జయలలిత స్మారకాన్ని శనివారం దర్శించుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

f
.

చెన్నైలోని పల్లవరానికి చెందిన ప్రేమ.. ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారారు. దీనికి కారణం ఆమె చేసిన వ్యాఖ్యలే కారణం. తాను జయలలిత వారసురాలినని చెప్పుకొచ్చారు ప్రేమ.

త్వరలో శశికళను కలుస్తా..

"నేను మైసూర్​లో జన్మించాను. 30ఏళ్లుగా చెన్నైలో నివాసం ఉంటున్నాను. సమయం వచ్చినప్పుడు నేను జయలలిత కుమార్తెనని నిరూపించుకుంటా. మరో 4-5రోజుల్లో శశికళను కలుస్తా." అని ప్రేమ తెలిపారు.

తనను పెంచిన తల్లిదండ్రులు మరణించారని, జయలలిత తనను బేబీ అని పిలిచేవారని వివరించారు ప్రేమ. అంతేకాక జయలలిత నివాసం పోయిస్ గార్డెన్​కు తాను ఓసారి వెళ్లానన్నారు.

ఇదీ చూడండి: పునీత్ రాజ్​కుమార్​ సమాధి ఎదుట పెళ్లి.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.